వావ్!! రంగస్థలంలో అంత VFX ఉందా..

వావ్!! రంగస్థలంలో అంత VFX ఉందా..

గత కొంత కాలంగా టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు సెట్లు వేయడం మానేశారు. అన్నిటికీ సెట్స్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేసినా కూడా మళ్ళీ కంప్యూటర్ గ్రాఫిక్స్ దగ్గరికి వెళ్ళాలి. VFX వర్క్ లేనిదే ఈ రోజుల్లో ఏ సినిమా బయటకు రావడం లేదు. అవుట్పుట్ అందంగా ఉండాలంటే ఆ మాత్రం టెక్నిక్స్ ఉపయోగించాలి. ఇక ఇటీవల వచ్చిన రంగస్థలం సినిమా సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో కూడా VFX వర్క్ సహకారం బాగానే ఉంది. మీకు ఆ విషయం తెలుసా?

ఇటీవలే రంగస్థలంలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు నిర్మాతలు. దానిని ఓసారి పరిశీలిస్తే.. సినిమా మొదటి షాట్ లోనే రామ్ చరణ్ సైకిల్ మీద స్పీడ్ గా వెళ్లడం చూస్తే ఎవ్వరైనా సరే ఏ లొకేషన్ లో తీశారు అబ్బా అని అనుమానం రాకుండా ఉండదు. పైగా ఆ రోడ్డు, దూరంగా కనిపించే కొండలు.. అన్ని చాలా వరకు నిజమైన పల్లెటూరి వాతావరణాన్ని తలపించాయి. తీరా ఇప్పుడు VFX మేకింగ్ వీడియోలో చూస్తే అంతా ఒక సెట్ లో షూట్ చేసినట్లు అర్ధమవుతోంది. ఖచ్చితంగా అది చూసి వావ్ అనుకోకుండా ఉండలేం.

ఇక నార్మల్ లైటింగ్ లో తీసిన షాట్స్ కూడా చీకట్లో ఉన్నట్లు బలే కవర్ చేశారు. రంగమ్మత్తతో చరణ్ పడవ మీద కూర్చొని పెట్టిన మందు అండ్ ముచ్చట్ల సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఆ సీన్ కూడా ఓ సెట్ వేసి తీశారంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. ఎక్కువగా కొండలను దూరంగా కనిపించే గుడిసెలను VFX తోనే కవర్ చేసేశారు. కానీ సినిమాను చూస్తున్నంత సేపు VFX అన్నట్లే అనిపించలేదు. ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు అన్నీ అలా కలిసొచ్చేస్తాయి అంతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు