నిర్మాత కొడుకు కోసం కాజల్??

నిర్మాత కొడుకు కోసం కాజల్??

పుడితే సినిమా నిర్మాత కొడుకుగా పుట్టాలిరా అనేలా ఓ వర్గం వారికి ఆలోచన కల్పిస్తున్నారు కొందరు నిర్మాతలు. సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బు మొత్తం మళ్ళీ కొడుకుల మీద నమ్మకంతో పెట్టి భారీ స్థాయిలో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది తనయులు ఇండస్ట్రీలో వారికంటు ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నారు. బెల్లంకొండ వారసుడు అయితే తండ్రి బ్యాక్ డ్రాప్ తోనే ఇతరులతో సినిమాలు చేస్తున్నట్లు అందరూ చెప్పుకునే విషయం. ఇప్పుడు అదే స్టయిల్లో మరో నిర్మాత కొడుకు వస్తున్నాడు.

ఒక సీనియర్ నిర్మాత తన కొడుకుని కూడా హీరోగా ఎంట్రీ ఇప్పించడానికి సాన పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు డివివి.దానయ్య. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన తన కొడుకు ని గ్రాండ్ గా లాంచ్ చేయడానికి గత కొంత కాలంగా మంచి కథ కోసం వెతుకుతున్నాడట. ఫైనల్ గా డైరక్టర్ తేజ చెప్పిన ఒక పాయింట్ నచ్చడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం తేజ తన రైటింగ్ డిపార్ట్మెంట్ తో స్క్రిప్ట్ పనులను పూర్తి చేస్తున్నారు. ఇక డివివి.దానయ్య కొడుకు ఇప్పటికే డ్యాన్సుల్లో రాటు దేలాడట. నటనలో కూడా సీనియర్ నటి నటుల దగ్గర కోచింగ్ తీసుకుంటున్నట్లు టాక్. అయితే ఈ పిల్లాడి పక్కన కొత్త పిల్లను మాత్రం హీరోయిన్ గా పెట్టట్లేదు.

ఈ కుర్రాడికి కాజల్ ని హీరోయిన్ గా సెట్ చేస్తే బావుంటుంది అని ఓ మాట అనుకున్నారట. దాని కోసం వెంటనే ఆమెకు భారీ రేంజులో దానయ్య ఓ ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కుర్రాడి పక్కన కాస్త సీనియర్ గా కనిపించే కాజల్ ఏం బాగుంటుంది గురూ అంటూ ఇప్పటికే పంచులు పడుతున్నా కూడా.. ఎంతమంది వచ్చినా కూడా కాజల్ కాజలే అంటూ ఈ నిర్మాత కవరింగ్ చేస్తున్నారట. ఒక ప్రక్కన చరణ్‌-బోయపాటి సినిమా.. మరో ప్రక్కన #RRRలతో బిజీగా ఉన్న దానయ్య.. తేజ స్క్రిప్ట్ పనులు ఫినిష్ చేస్తే త్వరలోనే తన కొడుకు సినిమాను అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు