యంగ్ హీరో లుక్కే మారిపోయిందిగా..

యంగ్ హీరో లుక్కే మారిపోయిందిగా..

చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. ఆ తర్వాత కొంచెం నిడివి ఎక్కువ ఉన్న క్యారెక్టర్లలోకి ఎదిగి.. ఆపై హీరోగానూ ప్రమోషన్ అందుకున్నాడు శ్రీవిష్ణు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’.. ‘మెంటల్ మదిలో’.. ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాలు అతడికి కథానాయకుడిగా మంచి పేరే తెచ్చాయి. ఇంటెన్స్ క్యారెక్టర్లు బాగా చేయగలడన్న గుర్తింపు వచ్చింది. ఇప్పుడు శ్రీవిష్ణు హీరోగా మరో సినిమా మొదలైంది. ఇంతకుమందు నారా రోహిత్‌తో ‘అసుర’ సినిమాను రూపొందించిన కృష్ణవిజయ్ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. శ్రీవిష్ణుకు మంచి మిత్రుడైన కృష్ణ విజయ్.. అతను హీరోగా నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’.. ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాల్ని వీరి మరో మిత్రుడు నారా రోహిత్‌తో కలిసి నిర్మించడం విశేషం. ఈ కొత్త సినిమాను మాత్రం బయటి నిర్మాతలతో చేస్తున్నారు.

తిప్పరా మీసం.. ఇదీ ఈ చిత్ర వర్కింగ్ టైటిల్. ఈ సినిమా కోసం శ్రీవిష్ణు పూర్తిగా అవతారం మార్చేశాడు. మీసం.. గడ్డం గట్టిగా పెంచేశాడు. చూడ్డానికి గుర్తు పట్టలేని విధంగా తయారయ్యాడు. ‘తిప్పరా మీసం’ అనే టైటిల్ వింటే ఇదేదో పెద్ద మాస్ హీరో చేస్తున్న సినిమా అనిపిస్తుంది. అలాంటి టైటిల్ ఇమేజ్ లేని.. సాఫ్ట్ క్యారెక్టర్లు చేసుకునే విష్ణు సినిమాకు పెట్టడం ఆశ్చర్యమే. మరి ఈ టైటిల్ వెనుక కథేంటో చూడాలి. ఇది కాకుండా విష్ణు చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఇంద్రసేన అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వీరభోగ వసంతరాయలు’లోనూ అతను ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అందులో నారా రోహిత్.. సుధీర్ బాబు.. శ్రియ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఇది కాక శ్రీవిష్ణుకు ఇంకో రెండు కమిట్మెంట్లు ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు