శ్రీదేవిని అంతగా వ్యతిరేకించినవాడే...

శ్రీదేవిని అంతగా వ్యతిరేకించినవాడే...

తన తల్లిని తండ్రి బోనీ కపూర్‌కు దూరం చేసిందని శ్రీదేవిని తీవ్రంగా వ్యతిరేకించేవాడు అర్జున్ కపూర్. ఆమెపై తన వ్యతిరేకతను బహిరంగంగా చూపించడానికి కూడా అతను వెనుకాడలేదు. మీడియా ముందు కూడా ఒకసారి శ్రీదేవిపై చిందులేశాడు. శ్రీదేవి కూతుళ్లు జాన్వి, ఖుషీలతో కూడా అతను ఎప్పుడూ సన్నిహితంగా మెలిగింది లేదు. కానీ ఇదంతా శ్రీదేవి మరణానికి ముందు కథ. ఆమె హఠాన్మరణం తర్వాత అతడిలో అనూహ్య మార్పు వచ్చింది. శ్రీదేవి కూతుళ్లకు బాగా దగ్గరయ్యాడు. వాళ్లను చేరదీశాడు. శ్రీదేవి చనిపోయినపుడు వాళ్లకు అండగా నిలిచాడు. ఓదార్పునిచ్చాడు. సోషల్ మీడియాలో జాన్వికి రెండు మూడు సందర్భాల్లో సపోర్ట్ చేశాడు. ఆమె గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ల మీద యుద్ధానికి వెళ్లాడు. ఒక వెబ్ సైట్‌ మీద కూడా పోరాడాడు.

ఇప్పుడు తన చెల్లెలిపై మరోసారి అతను ప్రేమ కురిపించాడు. జాన్వి కథానాయికగా పరిచయం కానున్న ‘ధడక్’ సినిమాను అర్జున్ ముందే ప్రివ్యూ చూశాడు. అనంతరం జాన్వి మీద ప్రశంసల జల్లు కురిపించాడు. తన అన్న తనను ఎలా పొగిడాడో జాన్వి వెల్లడించింది. ‘‘ఈ సినిమాలో నువ్వు చాలా నిజాయితీతో నటించనట్లుంది. ఒక హీరోయిన్ లాగా నువ్వు కనిపించలేదు. పాత్రలో లీనమైపోయావు. నిజాయితీగా నీ పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించావు’’ అంటూ అర్జున్ తనను ప్రశంసించినట్లు జాన్వి చెప్పింది. ‘ధడక్’ సినిమాకు సంబంధించి మున్ముందు ఎవరెన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా.. అర్జున్ ఇచ్చిన ప్రశంసే ఉత్తమమైందిగా నిలిచిపోతుందంటూ చాలా ఉద్వేగంగా చెప్పింది జాన్వి. అలాగే తన తండ్రి బోనీ కపూర్ కూడా సినిమా చూసి తనను మెచ్చుకున్నారని.. చాలా సహజంగా నటించానని కితాబిచ్చారని జాన్వి చెప్పింది. ఈ చిత్రం జులై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English