మాధవీలతకు బాధ తన్నుకొచ్చేస్తోందా!?

మాధవీలతకు బాధ తన్నుకొచ్చేస్తోందా!?

బిగ్ బాస్2.. ఈ రియాలిటీ షో మొదలై 15 రోజులు కూడా గడవలేదు. కానీ అప్పుడే వివాదాల పుట్టగా మారిపోతోంది. వివాదాలతో టీఆర్పీ రేటింగులు పెంచుకునే ఎత్తుగడో.. లేకపోతే రియల్ గానే అన్నేసి జరిగయో ఎవరికీ అర్ధం కావడం లేదు కానీ.. బిగ్ బాస్ హౌస్ లోపల బయట కూడా ఆ కార్యక్రమంపై సెన్సేషన్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కన్నడ అమ్మాయి కం టాలీవుడ్ హీరోయిన్ అయిన మాధవీ లత చెప్పిన మాటలు వింటుంటే.. అసలామె బాధేంటో అర్ధం కావడం లేదే అనిపించడం సహజం.

సినిమా వాళ్లతో టీఆర్పీలు పెంచుకోవడం అన్ని ఛానల్స్ కు సహజం. అదే ప్రయత్నంలో ఓ భాగంగా ఓ శాటిలైట్ ఛానల్ మాధవీలతను ఇంటర్వ్యూ చేస్తే.. ఈమె భలే కబుర్లు చెప్పింది. ఒక మనిషి గురించి 100పర్సెంట్ జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని అంటూనే.. అటు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి.. ఇటు సంజన వరకు.. తనతో కలిసి నటించిన నచ్చావులే హీరో తనీష్ నుంచి.. బాబు గోగినేని వరకూ ఒక్కరినీ వదిలిపెట్టకుండా కౌంటర్లు వేసింది. రియాలిటీ షో అన్నంత మాత్రాన అంతా రియాలిటీ ఉండదని.. టీఆర్పీల కోసం గేమ్ ఆడించడం సహజమే అని చెప్పింది. సంజన ఎలిమినేట్ అవుతుందని తనకు సోర్సెస్ ద్వారా ముందే తెలుసని కూడా చెప్పింది మాధవీ లత.

పైగా ఈమె ఎలిమినేషన్ విషయంలో.. సినిమా వాళ్లు అంతా ఒక్కటే అనే ఫీలింగ్ ఉంటుందని.. తాము ఎక్కువ.. కామన్ పీపుల్ తక్కువ అనే దురద సినిమా జనాల్లో చాలానే ఉంటుందని చెప్పిన ఆమె.. తాను కూడా బిగ్ బాస్ లో పాల్గొనేందుకు ఇంటర్వ్యూలలో పాల్గొన్నానని అంటోంది. రెండు సిరీస్ లకు ఇంటర్వ్యూకు వెళ్లగా రెండోసారి మాత్రం వారి ప్రశ్నల కారణంగా తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని అంటోంది మాధవీ లత. ఇంతకీ ఈమెను తీసుకోలేదనా.. ఇబ్బంది పెట్టారనా.. నాని హోస్టింగ్ నచ్చలేదనా.. అసలు ఏమీ అర్ధం కాకుండా బారెడంత ఇంటర్వ్యూ ఇవ్వడం మాధవీ లతకే చెల్లింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు