చైతూ.. మళ్లీ ఆ గెటప్ వేస్తావా?

చైతూ.. మళ్లీ ఆ గెటప్ వేస్తావా?

దేశంలో ఇప్పుడు బయోపిక్ ల సీజన్ బాగా నడుస్తోంది. టాలీవుడ్ లో ఈ కల్చర్ కథలు కాసింత ఆలస్యంగా మొదలైనా.. మొత్తానికి మహానటితో ఆరంభమైన బయోపిక్ ట్రెండ్.. బాగానే స్పీడందుకుంది. మహానటి మూవీ విడుదలకు ముందే వైఎస్ఆర్ బయోపిక్ తో పాటు.. ఎన్టీఆర్ బయోపిక్ పై కూడా అనౌన్స్ మెంట్ వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఏఎన్నార్ బయోపిక్ టాపిక్ కూడా వచ్చింది కానీ.. సినిమాగా ఆయన కథ బాగోదని నాగార్జున తేల్చేశారు. అయితే.. మహానటి మూవీలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య మురిపించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఏఎన్నార్ బయోపిక్ తీస్తే.. అందులో కూడా తాత గెటప్పును చైతుకే ఇస్తారని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోగా.. ఇప్పుడు మరో బయోపిక్ కోసం చైతును ఆ పాత్ర కోసం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ చేస్తున్న మూవీలో.. ఏఎన్నార్ పాత్ర కూడా కచ్చితంగా ఉండాల్సిందే.

సమకాలికులు.. ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ కంటే కాసింత సీనియర్ అయిన అక్కినేని నాగేశ్వరరావు.. సినిమాలో కాసిన్ని సీన్స్ లో అయినా కనిపించడం ఖాయమే. ఈ పాత్రకు వేరేవారిని తీసుకుంటే.. ఇప్పటికే చైతును ఆ పాత్రలో చూసిన కళ్లతో.. వేరేవారిని చూడడం కష్టం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని కన్ఫాం అయిన తర్వాత అంచనాలు కూడా పెరగడంతో.. ఏఎన్నార్ గెటప్పులో చైతు మరోసారి సందడి చేసే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు