డైరెక్టర్ భలే కవరింగ్ ఇస్తున్నాడు..

డైరెక్టర్ భలే కవరింగ్ ఇస్తున్నాడు..

ఓటర్ అంటూ మంచు విష్ణు హీరోగా ఓ చిత్రం ప్రారంభించి చాలా కాలమే అయింది. ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. పలు కారణాల రీత్యా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడీ సినిమాపై అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు కార్తీక్.. ఆలస్యానికి చాలానే రీజన్స్ చెప్పుకొచ్చాడు.

బైలింగ్యువల్ గా ఓటర్ మూవీ తెరకెక్కడంతో.. రెండు భాషలలో యాక్టర్లతో వేరువేరుగా షూటింగ్స్ చేశారట. అందరి కాల్షీట్స్ సర్దుబాటు అయ్యేసరికి ఆలస్యమైందట. టైటిల్ లోనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అని అర్ధం అవుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయిందని.. త్వరలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తామని అంటున్నాడు డైరెక్టర్. ఇది మంచు విష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అండ్ ఫిలిం అని చెప్పడం మాత్రమే కాదు.. మోహన్ బాబుకు అసెంబ్లీ రౌడీ మాదిరిగా.. మంచు విష్ణుకు ఓటర్ అంటూ భారీ డైలాగునే చెప్పేశాడు.

వినేందుకు ఇదంతా బాగానే ఉన్నా.. అసలు కథ వేరేగా ఉందని ఇండస్ట్రీ టాక్. సినిమా మొదలుపెట్టినప్పటి పరిస్థితి.. రిలీజ్ నాటి సిట్యుయేషన్ మారిపోయాయి. పైగా ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరైపోయాయి కూడా. ఇలాంటి సమయంలో పొలిటికల్ పంచ్ లు పేలే మాదిరిగా డైలాగులు ప్లస్ సన్నివేశాలు ఉంటే.. సినిమాకు ప్లస్ అవుతుందనే ఉద్దేశ్యంతో.. కొన్ని రీషూట్స్ ను మంచు విష్ణు సజెస్ట్ చేశాడని.. ఓటర్ మూవీ రిలీజ్ అందుకే లేట్ అయిందన్నది టాలీవుడ్ ఇంటర్నల్ టాక్. దాదాపు ఆరు నెలల క్రితమే షూటింగ్ పూర్తయిపోయిన సినిమాను.. ఇంతకాలం హోల్డ్ చేయడం వెనుక సీక్రెట్ కూడా ఇదేనంటున్నారు. మరి అందరికీ అసలు విషయం తెలిసినా.. దర్శకుడు ఇస్తున్న కవరింగ్ మాత్రం ఆసక్తికరంగా నమ్మబుద్ధేసేలానే ఉండడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు