ఈసారి చరణ్‌ 'జిగేలు రాణి' ఎవరంటే?

ఈసారి చరణ్‌ 'జిగేలు రాణి' ఎవరంటే?

'రంగస్థలం' చిత్రానికి మాస్‌ అప్పీల్‌ మరింత పెంచిన 'జిగేలు రాణి' సాంగ్‌ కోసం పూజా హెగ్డేకి భారీగానే ముట్టజెప్పారు. ఆ పాటకి అంత ఖర్చు పెట్టడం సినిమాకి పెద్ద ప్లస్సే అయింది. సినిమాకి వున్న ఆకర్షణలకి తోడు ఆ పాట మరో పెద్ద ఆకర్షణగా మారింది. అందుకేనేమో చరణ్‌ మలి చిత్రంలోను అలాంటి స్పెషల్‌ సాంగ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈసారి కూడా స్టార్‌ హీరోయిన్‌తోనే ఐటెమ్‌ సాంగ్‌ చేయిస్తున్నారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈసారి చరణ్‌ కోసం 'జిగేలు రాణి' అవతారమెత్తుతోంది. బోయపాటి శ్రీను సినిమా అంటేనే మాస్‌ మసాలాలకి లోటుండదు. కొత్తగా రకుల్‌ పాట యాడ్‌ అవడంతో 'ఇంకొంచెం మసాలా' తగిలించినట్టయింది. నిన్న మొన్నటి వరకు టాప్‌ హీరోయిన్‌గా వెలిగిన రకుల్‌కి ప్రస్తుతం టాలీవుడ్‌లో టైమ్‌ బాలేదు. ఈ టైమ్‌లో ఇంత క్రేజీ చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసే ఛాన్స్‌ రావడం కెరియర్‌ పరంగా పెద్ద బూస్టే. అందుకేనేమో ఈ అవకాశాన్ని ఆమె వెంటనే చేజిక్కించుకుంది. ఇటీవల ఐటెమ్‌ సాంగులన్నిటినీ హీరోయిన్లే ఎగరేసుకు పోతూ వుండడంతో అచ్చంగా ఐటెమ్‌ సాంగులే చేసేవారికి అవకాశాలు తగ్గిపోయాయి.

హీరోయిన్లు ఒక్క పాటకి ముప్పయ్‌ నుంచి అరవై లక్షలు డిమాండ్‌ చేస్తున్నా కానీ దాని వల్ల సినిమాకి అవుతోన్న ప్లస్‌ ఎంత అనేది గుర్తించిన నిర్మాతలు ఆ ఖర్చు లెక్క చేయడం లేదు. నాలుగైదు రోజులకే లక్షలొచ్చి పడుతోంటే హీరోయిన్లు కూడా ఈ పాటలని చిన్నచూపు చూడకుండా సైడ్‌ ఇన్‌కమ్‌గా చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు