హీరోలని బ్యాన్‌ చేసిన హీరోయిన్‌!

హీరోలని బ్యాన్‌ చేసిన హీరోయిన్‌!

సూపర్‌ టాలెంట్‌ వుండీ షేప్‌లో వుండడం రాక అవకాశాలు కోల్పోతున్న నిత్యామీనన్‌ ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదు. అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లాంటి స్టార్ల పక్కన నటించే అవకాశాలు వచ్చినా కానీ నిత్య దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. నానాటికీ లావెక్కుతోన్న తనపై ఎన్ని కామెంట్లు పడుతున్నా 'నా ఒళ్లు నా ఇష్టం' అన్నట్టు మాట్లాడిన నిత్యామీనన్‌కి ఇప్పుడు కనీసం యువ హీరోల సరసన కూడా అవకాశాలు రావడం లేదు.

'మహానటి' చిత్రంలో సావిత్రి పాత్ర పోషించే అవకాశాన్ని కూడా కోల్పోయింది. అయినప్పటికీ బరువు తగ్గే ప్రయత్నం చేయకుండా తనతో హీరోలెవరూ నటించకపోతే తానే హీరోగా నటిస్తానని కంగన రనౌత్‌లా మాట్లాడుతోంది. హీరోలు అక్కర్లేని కథలు ఎంచుకుని, తనకి వున్న పేరుతోనే సినిమాని నడిపిస్తానని అంటోంది. అయితే నయనతార లాంటి సూపర్‌ క్రేజీ హీరోయిన్లకే ఇప్పుడు ఆడియన్స్‌ వుండడం లేదు.

షేపవుట్‌ అయిన నిత్యామీనన్‌ని చూసేందుకు వస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. అందులోను లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో ఎన్ని క్లిక్‌ అవుతాయో, ఎన్ని మిస్‌ఫైర్‌ అవుతాయో తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు