సూర్య మళ్లీ గుంపులో గోవిందా!

సూర్య మళ్లీ గుంపులో గోవిందా!

ఒక టైమ్‌లో సూపర్‌స్టార్‌గా వెలిగిన సూర్యకి తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోను అద్భుతమైన మార్కెట్‌ వుండేది. రజనీ, కమల్‌ తర్వాత అంతటి సాలిడ్‌ మార్కెట్‌ని తెలుగులో సాధించింది సూర్యనే. కానీ వరుసపెట్టి చేసిన బ్యాడ్‌ సినిమాలు అతడి క్రేజ్‌ని దెబ్బ తీసాయి. ఈమధ్య అతని సినిమాలు బాగున్నాయనే టాక్‌ వచ్చినా ఆడడం లేదు.

అతని గత చిత్రం 'గ్యాంగ్‌' తెలుగు, తమిళంలో కూడా అంతంతమాత్రంగానే ఆడింది. తెలుగులో సంక్రాంతికి పలు చిత్రాల మధ్య విడుదల చేయడం వల్ల గ్యాంగ్‌కి సరయిన అటెన్షన్‌ లభించలేదు. లాంగ్‌ రన్‌ తెచ్చుకునే స్టఫ్‌ వున్న సినిమా కాకపోవడంతో ఆ తర్వాత కూడా పెద్దగా నిలబడలేదు. అయినా కానీ మరోసారి సూర్య చిత్రం రిలీజ్‌ టైమింగ్‌లో తప్పు దొర్లుతోంది. సెల్వరాఘవన్‌ డైరెక్షన్‌లో చేస్తోన్న చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రాలు చాలానే రాబోతున్న టైమ్‌లోనే అనువాద చిత్రాన్ని కూడా ప్లాన్‌ చేయడం కచ్చితంగా సూసైడలే అనాలి. చరణ్‌, బోయపాటి సినిమాతో పాటు, ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఇంకా పలు భారీ చిత్రాలే వచ్చే సంక్రాంతిని టార్గెట్‌ చేస్తున్నాయి. అసలే టైమ్‌ బాగోలేని సూర్య ఇంత కాంపిటీషన్‌లో తన సినిమా రిలీజ్‌ పెట్టుకోవడం వల్ల ఒరిగేదేమిటో మరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు