అల్లు శిరీష్‌ ప్రెజర్‌ తట్టుకోలేకేనట!

అల్లు శిరీష్‌ ప్రెజర్‌ తట్టుకోలేకేనట!

అల్లు అర్జున్‌ తమ్ముడు శిరీష్‌ హీరో అయి చాలా కాలమవుతున్నా ఇంకా మెగా ఫాన్స్‌ నుంచి అతనికి ఆమోదం లభించలేదు. మెగా ఫ్యామిలీ నుంచి పరిచయమైన వారిలో అల్లు శిరీష్‌కే ఎలాంటి ఐడెంటిటీ రాలేదింకా. 'శ్రీరస్తు శుభమస్తు', 'కొత్తజంట' చిత్రాలు హిట్టేనని గీతా ఆర్ట్స్‌ గీ పెట్టినా కానీ అతడికి మార్కెట్‌ ఏర్పడలేదు. గీతా ఆర్ట్స్‌ అండ లేకపోతే అతని సినిమాల బిజినెస్‌లోని డొల్లతనం 'ఒక్క క్షణం' చిత్రం చూపించింది. ఆ చిత్రం కనీసం ఓపెనింగ్‌ కూడా రాబట్టుకోని డిజాస్టర్‌గా నిలిచింది.

అయినా కానీ అల్లు శిరీష్‌కి బిల్డప్‌ ఇస్తూ అతను మలయాళంలో నటించిన చిత్రాన్ని 'యుద్ధభూమి'గా విడుదల చేస్తున్నారు. నాలుగు వందల థియేటర్లలో విడుదల చేస్తున్నామంటూ ఊదరగొడుతున్నారు. మరోవైపు మలయాళ చిత్రం 'ఏబిసిడి'ని అతను తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడు. అక్కడే అంతంత మాత్రంగా ఆడిన సినిమాని ఇక్కడెందుకు రీమేక్‌ చేస్తున్నారనేది అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం తనకి కథలు దొరక్క, యువ దర్శకులు ఎవరూ సంప్రదించక ఐడెంటిటీ క్రైసిస్‌తో బాధ పడుతున్నాడట.

ఏదో ఒక సినిమా చేస్తున్నాడని అనిపించుకోకపోతే తనని మీడియా పూర్తిగా రైట్‌ ఆఫ్‌ చేస్తుందని హడావిడిగా ఈ చిత్రం మొదలు పెట్టించేసాడట. మరి ఈసారి అయినా ఫాన్స్‌ అతడిని హీరోగా గుర్తిస్తారో లేదో కానీ ఈ చిత్రం అటు ఇటు అయితే మాత్రం అల్లు శిరీష్‌కి ఆ తర్వాత అవకాశాలు రావడం కష్టమేనని గుసగుసలాడుకుంటున్నారు ఇండస్ట్రీ వాసులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English