ఇంకో కమెడియన్‌ గుల్లయ్యాడు

ఇంకో కమెడియన్‌ గుల్లయ్యాడు

కొందరు కమెడియన్లకి పెద్ద సినిమాల్లో ఒకటి, రెండు సీన్లకి మించి వుండడం లేదు. దీంతో తమ టాలెంట్‌ చూపించుకునే వీలు చిక్కడం లేదని భావిస్తున్నారో ఏమో కానీ ఫుల్‌ లెంగ్త్‌ సినిమాలు హీరోలుగా చేసేస్తూ ప్రేక్షకులని ఆకట్టుకోలేక బొక్క బోర్లా పడుతున్నారు. హీరోలుగా మారుతోన్న కమెడియన్లు ఒక్కొక్కరుగా కనుమరుగయ్యే పరిస్థితి వస్తున్నా మన అదృష్టమెలా వుందో చూద్దామని రాయేసి చూసే వాళ్లే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. తాజాగా శ్రీనివాసరెడ్డి 'జంబలకిడిపంబ'తో చేతులు కాల్చుకున్నాడు.

ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతలలో ఒకడిగా కూడా శ్రీనివాసరెడ్డి వ్యవహరించాడు. ఈ చిత్రం ఖచ్చితంగా పెద్ద హిట్‌ అయిపోతుందని నమ్మడం వల్ల పారితోషికం లేకుండా ఎదురు డబ్బులు పెట్టి మరీ గుల్లయ్యాడు. గీతాంజలి, ఆనందోబ్రహ్మ చిత్రాలకి తానే హీరోనని చెప్పుకునే శ్రీనివాసరెడ్డికి అందులో తనది హీరో పాత్ర కాదని గుర్తించలేకపోయాడు.

ఇంతకుముందు అతను హీరోగా నటించిన చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా మాత్రమే. దాని ఫలితమేంటనేది తెలిసిందే. కానీ తనలో ఒక ఫుల్‌ సినిమాని నడిపించే సత్తా వుందనే నమ్మకంతో మళ్లీ మళ్లీ హీరోగా ప్రయత్నాలు చేస్తూ తాజాగా సొంత డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు. హీరోయిజం చూపిస్తోన్న కమెడియన్ల క్యూలో నెక్స్‌ట్‌ షకలక శంకర్‌ వున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు