రెండు నెల‌ల్లో రాందేవ్‌బాబా వాట్సాప్‌

రెండు నెల‌ల్లో రాందేవ్‌బాబా వాట్సాప్‌

స్వ‌దేశీ ఎపుడూ మంచిదే. ఆద‌ర‌ణ కూడా అలాగే ఉంటుంది. కానీ జ‌నం మెచ్చ‌క‌పోతే ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో మొన్నే రాందేవ్ బాబా కంపెనీ ప‌తంజ‌లికి అర్థ‌మైంది. పెద్దగా ప్ర‌చారం లేకుండానే వాట్స‌ప్‌కు పోటీగా *కింభో* పేరుతో ఒక యాప్‌ను త‌యారుచేసింది ప‌తంజ‌లి కంపెనీ. దానిని గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు, ఐవోఎస్‌లో కూడా పెట్టింది. ఆరుగంట‌ల్లో రెండు ల‌క్ష‌ల డౌన్లోడ్స్ న‌మోదుచేసి రికార్డు సృష్టించింది కింభో. లోపాలు లెక్క‌కు మించి ఉండ‌టం, ప్రైవ‌సీ విష‌యంలో చాలా పూర్‌గా ఉండ‌టంతో జ‌నం నుంచి విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంది. దీంతో వెంట‌నే దానిని ఉప‌సంహ‌రించుకున్నారు. ఇది జ‌రిగి దాదాపు నెల‌ గ‌డిచింది.

తాజాగా రాందేవ్‌బాబా కింభోపై స్పందించారు.  ‘స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌’ను భవిష్యత్తులో అధికారికంగా లాంచ్‌ చేస్తామని చెప్పారు. దీనికి మ‌రో రెండు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంద‌ని రాందేవ్ చెప్పారు. మార్కెట్‌లో ఉన్న ప్రస్తుత మెసేజింగ్‌ యాప్స్‌కు గట్టి పోటీగా పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ యాప్ *కింభో* నిలుస్తుంద‌న్నారాయ‌న‌.  ‘టెస్టింగ్‌ దశలోనే ఈ యాప్‌ భారీ ఎత్తున ట్రాఫిక్‌ను ఎదుర్కొంది. యూజర్‌ ట్రాఫిక్‌ను ఎలా నిర్వహించాలో ప్రస్తుతం అధ్య‌య‌నం జ‌రుగుతోంది. ఈ యాప్‌ మరో రెండు నెలలు అన్ని టెస్ట్‌లు పూర్తి చేసుకుంటుంది. త‌ర్వాత‌ మార్కెట్లోకి విడుద‌ల చేస్తాం అని రాందేవ్ ప్ర‌క‌టించారు. నిజానికి జూన్ 21న యోగ డే రోజున దీనిని విడుద‌ల చేయాల్సి ఉంది. కానీ టెక్నిక‌ల్‌గా ఇంకా టెస్ట్‌లు పూర్తికాక‌పోవ‌డం వ‌ల్ల విడుద‌ల ఆల‌స్య‌మైంది.

 కింభో యాప్ ఫౌండ‌ర్ క‌మ‌ల్ అదితి. పతంజలి కంపెనీ ఆధ్వ‌ర్యంలో కింభోను నిర్వ‌హిస్తున్నారు. ఈమె గ‌తంలో గూగుల్ హ్యాంగౌట్స్ టీంలీడ‌ర్‌గా ప‌నిచేశారు. యాహూమెయిల్‌, ఒర‌కిల్‌లో కూడా ఆమె ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఈమె స‌ద‌ర‌న్ కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీలో ఎమ్మెస్సీ కంప్యూట‌ర్స్ చ‌దివారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English