టీఆర్ఎస్ ఎంపీకి ప‌ద‌వి ద‌క్కితే..టీజీ రాజీనామే

టీఆర్ఎస్ ఎంపీకి ప‌ద‌వి ద‌క్కితే..టీజీ రాజీనామే

టీఆర్ఎస్ పార్టీ ముఖ్య‌నేత‌, రాజ్యసభ ఎంపీ కేకేశవరావుకు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌కు మ‌ధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం టీఆర్ఎస్ క‌లిసి రాక‌పోతే తెలంగాణ‌లోని సెటిల‌ర్లు టీఆర్ఎస్‌కు ఓటువేయ‌బోరంటూ టీజీ వెంక‌టేశ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కేకే మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. దీనిపై టీజీ ఘాటుగా స్పందించారు.  కేకేకు మెదడు మోకాళ్లో ఉందని  చెప్పారు. కేసీఆర్‌కు కేకే వల్ల ఒరిగింది శూన్యమని ఎద్దేవా చేశారు. ఆయనో తాగుబోతని తీవ్ర‌ వ్యాఖ్య‌లు చేశారు. ఉద్యమం పేరుతో వేలమంది పిల్లల్ని బలి చేశారు. ఇప్పుడు అధికారం అనుభవిస్తోన్న కేకే లాంటి చాలా మంది నాయకులు అసలు ఉద్యమంలోనే పాల్గొనలేదు. కనీసం కాలిగోటికైనా బుల్లెట్‌ తగిలి ఉండదు. వీళ్లందరికీ ఒకటే పని.. రాత్రైతే కేసీఆర్‌ కాళ్లు పిసకడం, మందుతాగడం తప్ప ఇంకోటి చేయరు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రయితే ఫుల్లుగా తాగే కేకే తమను విమర్శించడం మానుకోవాలని సూచించారు.

ఆంధ్ర ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాలూ కలిసి పనిచేయాలని లేకపోతే రెండు రాష్ట్రాలకూ నష్టమేనని టీజీ అన్నారు. స్టీల్ ప్లాంట్లు, కృష్ణా నదీ జలాలు వటంటి అంశాలు రెండు రాష్ట్రాలకూ సంబంధించిన అంశాలని చెప్పారు. రాయలసీమ హక్కుల కోసం తాను పనిచేశానని, రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమకు న్యాయం చేయాలని అడిగానని గుర్తుచేశారు. కేటీఆర్‌, కవితలు కూడా ఏపీ హక్కుల కోసం మాట్లాడటం మనం చూశాం. ఇప్పుడీ కేకే నన్ను తిట్టడంలో ఏమైనా అర్థం ఉందా? కేకే.. నీకు వ్యవహారం తెలియకుంటే హరీశ్‌, కవిత, కేటీఆర్‌ల్ని చూసి నేర్చుకో, లేదా, మా మంత్రి నారా లోకేశ్‌ దగ్గరికి రా’’ అని టీజీ వ్యాఖ్యానించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా కేకే ఎన్నికైతే తాను రాజీనామా చేస్తానని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచ‌ల‌న స‌వాల్ విసిరారు. డబ్బిచ్చి ఎంపీ సీటు కొన్నారన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘ఏ వెధవ లం..కొడుకు అన్నాడామాట?’’ అని విరుచుకుపడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు