రేసు గుర్రానికి ముసుగేశారు!!!

రేసు గుర్రానికి ముసుగేశారు!!!

ప్రస్తుతం అల్లు అర్జున్‌ చెయ్యాల్సిన ఏకైక సినిమా 'రేసు గుర్రం' సినిమా ఒక్కటే. ఇద్దరమ్మాయిలతో సినిమా తరువాత మనోడు సైన్‌ చేసింది ఈ సినిమానే. కిక్‌, ఊసరవెల్లి సినిమాలతో మరో కొత్త అడుగు వేసిన దర్శకుడు సురేందర్‌ రెడ్డి దర్వకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

అయితనే మే 1న మొదలవ్వాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు స్టార్ట్‌ అవ్వలేదు. ఇక అలా అనుకుంటే పొరపాటే. ఆల్రెడి 'రేసు గుర్రం' సినిమా షూటింగ్‌ మొదలయ్యి, ఒక పది రోజుల షెడ్యూల్‌ను పూర్తిచేసేశారట. ఎటువంటి హడావుడి లేకుండా దర్శకుడు సురేందర్‌ రెడ్డి చాలా కామ్‌గా ఈ మొదటి షెడ్యూల్‌లో మంచి కామెడి సన్నివేశాలను తెరకెక్కించాడని తెలుస్తోంది. మొత్తానిక కామెడి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ గుర్రాన్ని సైలెంటుగా అలా ముసుగులో పరిగెత్తిస్తున్నారనమాట.

పైగా ఈ షెడ్యూల్‌ పూర్తి చేసిన బన్నీ, త్వరలోనే పాటల చిత్రీకరణ కోసం నార్వే వెళ్ళనున్నాడని యునిట్‌  వర్గాలు తెలిపాయి. ఇప్పటికే హీరోయిన శృతిహాసన్‌ యురోప్‌లో ఉంటూ ఎవడు పాటల షూటంగ్‌లో పాల్గొంటుంది, ఆమె అటు ఫ్రీ అవ్వగానే మనోళ్ళు ఇటునుండి నార్వే వెళ్తారనమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు