అదితి.. భలే ముద్దొచ్చేస్తోంది

అదితి.. భలే ముద్దొచ్చేస్తోంది

తాజాగా రిలీజైన సినిమాల్లో సమ్మోహనం ఇప్పటికే డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి వారం తరవాత పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింటే అవుతుంది. సునిశిత హాస్యంతో నిండిన ప్రేమకథ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటోంది.

సమ్మోహనం సినిమాలో అందరినీ కట్టిపడేసిన అంశం ఏదంటే అది హీరోయిన్ అదితిరావ్ హైదరియే. డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఏరికోరి ఆమెను హీరోయిన్ గా తీసుకున్నాడు. మణిరత్నం డైరెక్ట్ చేసిన చెలియాతో సౌత్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ సమ్మోహనంతో టాలీవుడ్ లో ఎంటరయింది. తెలుగమ్మాయే అవడం మనవాళ్లకు ఇంకా నచ్చేసింది. తాజాగా వేరే సినిమా షూటింగ్ కోసం మాల్దీవుల్లో ఉన్న ఈ భామ సమ్మోహనం సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ‘‘సమ్మోహనం సక్సెస్ ను దూరంగా ఇక్కడున్న సముద్రం ఒడ్డునున్న గాలులతో ఎంజాయ్ చేస్తున్నా. మొత్తం గ్యాంగ్ ని మిస్సవుతున్నా. మమ్మల్నందరినీ మెరిపించిన మీకు ధన్యవాదాలు.’’ అంటూ అదితి సోషల్ మీడియాలో తన ఫీలింగ్ పంచుకుంది.

వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా సమ్మోహనం సినిమాలోని ఓచెలితార పాటను పాడింది. అచ్చ తెలుగమ్మాయి కావడంతో ఆమె పాడుతున్న పాటను అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. నిజం చెప్పొద్దూ.. ఆ పాట పాడుతున్న అదితిని చూస్తే తెగ ముద్దొచ్చేస్తుందని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు