షకలక శంకర్ కు అలా అనిపిస్తోందే

షకలక శంకర్ కు అలా అనిపిస్తోందే

ఏవైనా భ్రమ.. భ్రాంతిలకు గురయ్యి మాట్లాడుతుంటే.. పాపం అలా అనిపిస్తోందే అనుకుంటూ ఉంటాం. అఫ్ కోర్స్.. యమలీల మూవీతో ఇలా అనుకోవడం కూడా సినిమాలే అలవాటు చేసినా.. ఇప్పుడు ఓ కమెడియన్ ను చూసి టాలీవుడ్ జనాలు ఇలాగే అనుకుంటున్నారు. షకలక శంకర్ కు కమెడియన్ గా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందినది షకలక శంకరే. పవన్ కళ్యాణ్ పై జపాలు తపాలు చేసి భక్తి చాటేయడం.. అందరినీ ఆకట్టుకుంది. సినిమాల్లో కూడా మంచి కమెడియన్ గా పేరు దక్కించుకున్నాడు. ఇలా కమెడియన్ గా క్లిక్ అయిన వారు.. హీరోగా ట్రై చేయడం ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీనే. అందులో భాగంగా శంభోశంకర అంటూ షకలక శంకర్ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. ఇంతవరకూ ఓకే అయినా.. హీరోగా మారడానికి కారణం ఏంటి అని అడిగితే ఇతడి నుంచి వచ్చిన సమాధానమే అందరికీ తేడాగా అనిపించింది.

గీతాంజలి.. రాజు గారి గది.. ఆనందో  బ్రహ్మ చిత్రాలలో అనేకమంది కమెడియన్స్ ఉన్నా.. ఇతడి కామెడీ కారణంగానే ఆయా చిత్రాలు ఆడేశాయట. తన కామెడీకి జనాల్లో అంత డిమాండ్ ఉన్నపుడు హీరోగా చేస్తే తప్పేంటి అన్నట్లుగా ఉంది షకలక శంకర్ వాలకం. క్యారెక్టర్లు క్లిక్ కావడం వేరు.. సినిమా మొత్తంగా సెట్ కావడం వేరు అనే విషయం ఇతడికి ఎవరు చెబుతారో.. ఇలా అనిపించడం మొదలుపెట్టి హీరోగా మారిన కమెడియన్స్.. ఇప్పుడు ఎలా ఉన్నారో చూసి కూడా అదే రూట్లో వెళుతున్నాడు షకలక శంకర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు