ఆ టైటిల్ ఏంటి.. ఈ గెటప్పేంటి?

ఆ టైటిల్ ఏంటి.. ఈ గెటప్పేంటి?

కాన్సెప్ట్ ఏదైనా సరే.. సినిమాకి అట్రాక్షన్ రావాలంటే మాత్రం కలరింగ్ ఉండాల్సిందే. కమిట్మెంట్ తో మాంచి కథను ఎంచుకుని మూవీ రూపొందించినా.. జనాలను ఎట్రాక్ట్ చేసేందుకు కమర్షియల్ హంగుల జోలికి వెళ్లక తప్పదని అంటారు మూవీ జనాలు. ఇలాంటివి లేకుండా కూడా డబ్బులు తెచ్చిన సినిమాలు కొన్ని ఉండొచ్చు కానీ.. మెజారిటీ మేకర్స్ రిస్క్ చేయరు.

ఇప్పుడు సత్యమేవ జయతే అంటూ బాలీవుడ్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే పిక్చరైజేషన్ పూర్తయిపోగా.. ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు కూడా మేకర్స్ రెడీ అయిపోయారు. జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు రీసెంట్ గా ఫస్ట్ లుక్ ఇవ్వగా అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోంటోంది ఐషా శర్మ. రామ్ చరణ్ తొలి చిత్రం చిరుతలో నటించిన నేహా శర్మ చెల్లెలే ఈ ఐషా శర్మ. ఈ భామకు సంబంధించిన లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

అయితే.. ఆ సత్యమేవ జయతే అన్న టైటిల్ కు కానీ.. పైన డిజైన్ చేసిన జాతీయ జెండాకు కానీ కొంచెం కూడా జస్టిఫికేషన్ లేకుండా.. ఐషా శర్మను బాగా హాట్ గా చూపించారు. సినిమాకు సంబంధించిన ట్యాగ్ లైన్ ను కోట్ చేస్తూ ట్వీట్ పెట్టింది కానీ.. ఐషా అందాలే ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి. మరి ఈ లుక్ కి సత్యమేమ జయతే టైటిల్ ని మేకర్స్ ఎలా మ్యాచ్ చేస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు