ఇంద్రగంటికి ‘పెళ్ళిచూపులు’ స్ఫూర్తి అట

ఇంద్రగంటికి ‘పెళ్ళిచూపులు’ స్ఫూర్తి అట

సెన్సిబుల్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన కొత్త సినిమా ‘సమ్మోహనం’ ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకాదరణా పొందుతోంది. ఇంద్రగంటి బెస్ట్ మూవీస్‌లో ఒదొకటి అంటున్నారు. ఐతే ఈ కథను చాలామంది నిర్మాతలు ఒప్పుకోలేదట. ఈ సినిమా తీయడానికి కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించిన ‘పెళ్ళిచూపులు’ స్ఫూర్తిగా నిలిచిందట. వీటికి సంబంధించిన వివరాలేంటో ఇంద్రగంటి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.


‘‘సమ్మోహనం’ కథని 2012లో రాసుకుని కొందరికి వినిపించాను. కానీ ఎవరూ సినిమా తీయడానికి ముందుకు రాలేదు. చివరికి నాతో ‘జెంటిల్‌మన్’ తీసిన శివలెంక కృష్ణప్రసాద్‌ గారికి కథ చెబితే వెంటనే ఓకే చేశారు. అంతే కాకుండా నాపై, కథపై నమ్మకంతో సినిమా విడుదలయ్యే ముందు, తర్వాత కూడా ఆయన సినిమా చూడలేదు. అది ఆయన గొప్పదనం. తరుణ్‌ భాస్కర్‌ డైరెక్ట్‌ చేసిన ‘పెళ్ళిచూపులు’ సినిమాలో ఓ సన్నివేశం చూసి మనమెందుకు ఇలాంటి సన్నివేశాలు, కథ రాయలేం అనిపించి.. ఆ స్ఫూర్తితో ‘సమ్మోహనం’ కథను తయారు చేసుకున్నాను. సుధీర్‌బాబు ఒక ఛాలెంజ్‌లా తీసుకుని ఈ చిత్రంలో నటించాడు. నా కథ వినగానే సినిమా చేయడానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ వివేక్‌ సాగర్‌ ఒప్పుకున్నాడు. కెమెరామెన్‌ విందా నా మనసులో ఏముందో అది తెర మీద చూపిస్తారు. మా మధ్య మంచి అనుబంధం ఉంది. అందరూ కలిసి ఒక మంచి సినిమా తీయడానికి సహకరించారు’’ అని ఇంద్రగటి చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు