కాలా అక్కడే ఆగిపోయాడు

కాలా అక్కడే ఆగిపోయాడు

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌కే ఒక మచ్చ అయిపోయింది ‘కాలా’ సినిమా. రజనీకాంత్ ఎవరితో సినిమా చేసినా సరే.. ముందు దానిపై ఎలాంటి అంచనాలున్నప్పటికీ విడుదల సమయానికి హైప్ ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ఆ సినిమా విషయంలో జనాల్లో వేలం వెర్రి కనిపిస్తుంది. కానీ ‘కాలా’ విషయంలో మాత్రం అలాంటిదేమీ జరగలేదు. ఈ చిత్రానికి రిలీజ్ ముంగిట మినిమం బజ్ కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ పేలవంగా సాగాయి. ఇక రిలీజ్ తర్వాత టాక్ కూడా అంతంతమాత్రంగా రావడంతో బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్నందుకుందీ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో అయితే ‘కాలా’ ఓపెనింగ్స్ పెద్ద షాకిచ్చాయి. తొలి వారాంతంలో ఆ చిత్రం రూ.6.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. వీకెండ్ తర్వాత అయితే పరిస్థితి మరీ దారుణం.

తర్వాత అన్ని రోజుల్లో కలిపితే షేర్ అర కోటి మాత్రమే రావడం గమనార్హం. మొత్తంగా ‘కాలా’ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్లో వసూలు చేసిన షేర్ కేవలం రూ.7 కోట్లు మాత్రమే. వీకెండ్ తర్వాత ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చినా ఫుల్ రన్లో షేర్ రూ.10 కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ పండిట్లు అంచనా వేశారు. కానీ రూ.7 కోట్ల మార్కు దగ్గరే ఆగిపోయి షాకిచ్చిందీ చిత్రం. అదృష్టం కొద్దీ బయ్యర్లెవరూ ఈ సినిమా కొనడానికి ముందుకు రాలేదు. తెలివిగా తప్పించుకున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్ కమిషన్ పద్ధతిలో సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. ఐతే వాళ్లకు ఈ సినిమా వల్ల ఒరిగిందేమీ లేదు. భారీ మొత్తానికి ఈ చిత్ర ప్రదర్శన హక్కుల్ని హోల్ సేల్‌గా కొన్న లైకా ప్రొడక్షన్స్‌కు పెద్ద దెబ్బే తగిలింది దీని వల్ల. అసలే ‘2.0’ వల్ల ఫినాన్షియల్ క్రైసిస్‌లో ఉండగా.. ‘కాలా’ వాళ్లను మరింత పెద్ద దెబ్బ కొట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English