మణిశర్మ బాగా హర్టయ్యాడబ్బా..

మణిశర్మ బాగా హర్టయ్యాడబ్బా..

ఒకప్పుడు టాలీవుడ్లో మణిశర్మ హవా మామూలుగా ఉండేది కాదు. టాలీవుడ్ స్టార్ హీరోలు.. దర్శకులందరూ అతడినే ప్రిఫర్ చేసేవాళ్లు. లెక్కలేనన్ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు ఈ సంగీత జ్ఞాని. కానీ తర్వాత తర్వాత ఆయన హవా తగ్గిపోయింది. సినిమాలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఏదో ఉన్నాడంటే ఉన్నాడని అనిపిస్తున్నాడు మణి. ఐతే తనను వద్దనుకున్నందుకు బాధ ఏమీ లేదని.. ఇప్పుడు తాను వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని అన్నాడు మణి. ఆరోగ్యం చూసుకుంటూ.. మంచి మంచి సంగీతం వింటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లుగా మణిశర్మ చెప్పాడు.

ఐతే తన దగ్గర పని చేసి.. తన నుంచి పని నేర్చుకున్న చాలామంది శిష్యులు.. తన దగ్గరి నుంచి వెళ్లిపోయాక అందరి దగ్గరా తనను తిట్టడం మాత్రం బాధ కలిగిస్తున్నట్లు ఆయన చెప్పాడు. పేర్లు చెప్పలేదు కానీ.. తనను తిట్టుకునే శిష్యులు చాలామందే ఉన్నారని మణి తెలిపాడు. తాను మామూలుగా కోపిష్టినని.. అలాగే చిన్న పనిలోనూ పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తానని.. కాబట్టి పని విషయంలో తేడా వస్తే తాను తిడతానని మణి చెప్పాడు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని.. అపార్థం చేసుకుని తన శిష్యుల వేరే వాళ్ల దగ్గర తనను తిట్టడం మనస్తాపం కలిగించినట్లు మణి తెలిపాడు. ఆ విషయాలన్నీ తెలిసినపుడు వీళ్లెందుకు ఇలా చేస్తున్నారని అనిపించిందన్నాడు. తమ రోజుల్లో అయితే గురువులు ఇంకా కఠినంగా ఉండేవారని.. వాళ్లతో పోలిస్తే తాను నయమే అని మణి చెప్పాడు. ఈ మధ్య ఒక అమ్మాయి.. తన మాటలతో కుంగిపోయినట్లుగా వేరే వాళ్ల దగ్గర చెప్పుకుందని.. కానీ తాను ఎవ్వరినీ ఉద్దేశపూర్వకంగా.. వ్యక్తిగతంగా తిట్టనని.. పని కోసం తిట్టడం తన బలహీనత అని మణి స్పష్టం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు