మిస్ ఇండియా వెనుక రకుల్

మిస్ ఇండియా వెనుక రకుల్

ఏటా జరిగే మిస్ ఇండియా పోటీలపై జనాల్లో చాలా ఆసక్తి ఉంటుంది. ఈసారి కూడా ఈ పోటీలు అందరి దృష్టిని ఆకర్షించాయి. చెన్నైకి చెందిన 19 ఏళ్ల అమ్మాయి అనుక్రీతి వాస్ ఈసారి మిస్ ఇండియాగా ఎంపికైన సంగతి తెలిసిందే. మిస్‌ ఇండియా వరల్డ్‌గా ఎంపిక కావడం వెనక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ పాత్ర ఉండటం విశేషం.

అనుక్రీతికి రకుల్ మెంటార్‌ గా పని చేసిన విషయం చాలా మందికి తెలియదు. అనుక్రీతి పోటీలకు వెళ్లడానికి ముందు రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వద్దే శిక్షణ తీసుకుంది. అందం.. ఆత్మవిశ్వాసం.. అభినయం.. ఆహారం.. నడక.. నడత వంటి విషయాలన్నింట్లోనూ రకుల్ దగ్గర సలహాలు తీసుకుందామె. రకుల్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ సాధన కూడా చేసింది. రకుల్‌ చాలా శ్రద్ధ పెట్టి.. చాలా రోజులు ఆమె కోసం కేటాయించి అన్ని విషయాలూ నేర్పించిందట. ఈ అందాల పోటీల్లో సౌత్‌ జోన్‌ కు రకుల్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించడం గమనార్హం.

అందాల పోటీలతో రకుల్ కనెక్షన్ ఈనాటిది కాదు. టీనేజీలో ఆమె కూడా చాలా అందాల పోటీల్లో పాల్గొంది. మిస్ ఇండియా పోటీల్లో ఆమె ఫైనల్స్ వరకు వెళ్లింది. ఐదో స్థానంలో నిలిచింది. రకుల్ పీపుల్స్ ఛాయిస్ మిస్ ఇండియాటైమ్స్.. పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్.. ఫెమినా మిస్ టాలెంటెడ్.. ఫెమినా మిస్ బ్యూటిఫుల్ స్మైల్.. ఫెమినా మిస్ బ్యూటిఫుల్ ఐస్ పోటీల్లో విజేతగా నిలవడం విశేషం. ఆ తర్వాతే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English