డిజాస్టర్లు కొట్టినా స్పీడు తగ్గలేదే

డిజాస్టర్లు కొట్టినా స్పీడు తగ్గలేదే

హీరో హీరోయిన్లకైనా.. టెక్నీషియన్లకైనా వరుసగా రెండు పెద్ద ఫ్లాపులు ఎదురైతే కెరీర్ డౌన్ అయిపోతుంది. అవకాశాలు తగ్గిపోతాయి. కానీ యువ కథానాయకుడు నితిన్ విషయంలో అలాంటిదేమీ జరగట్లేదు. ‘అఆ’ రూపంలో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తర్వాత నితిన్ వరుసగా రెండు డిజాస్టర్లు తిన్నాడు. ‘లై’, ‘చల్ మోహన్ రంగ’ తీవ్ర నిరాశకు గురి చేశాయి.

అయినప్పటికీ అతడి కెరీర్లో ఊపు తగ్గలేదు. ‘చల్ మోహన్ రంగ’ విడుదలైన వెంటనే అతను దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతతో ‘శ్రీనివాస కళ్యాణం’ మొదలుపెట్టాడు. ఆ సినిమా ముగింపు దశకు వచ్చింది. ఈ లోపు ఇంకో రెండు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు నితిన్.

‘ఛలో’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కొత్త దర్శకుడు వెంకీ కుడుముల తర్వాతి సినిమా నితిన్‌తోనే చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. దీనికి ‘భీష్మ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. మరోవైపు విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో ఓ సినిమా కమిటయ్యాడు నితిన్.

సాయిధరమ్ తేజ్, గోపీచంద్ లాంటి హీరోల్ని ట్రై చేసి చివరికి నితిన్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు యేలేటి. ఈ చిత్రాన్ని ‘రంగస్థలం’ నిర్మాతలు ప్రొడ్యూస్ చేయబోతుండటం విశేషం. ఇంతకుముందు ఎక్కువగా సొంత బేనర్లో సినిమాలు చేస్తూ వచ్చిన నితిన్.. ఇప్పుడు వరుస ఫ్లాపులు ఎదురైనప్పటికీ ప్రముఖ బేనర్లలో సినిమా అవకాశాలు అందుకుంటుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు