ఓ ఊరమాస్ కథంట చెప్పండయ్యా!!

ఓ ఊరమాస్ కథంట చెప్పండయ్యా!!

నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన వరుణ్ తేజ్.. తొలి చిత్రం నుంచి వైవిధ్యత చూపిస్తూ.. మెగా హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కంచెతో తొలి హిట్ అందుకోవడమే కాకుండా.. ఫిదా మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి.. మీడియం బడ్జెట్ మూవీస్ కు ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఫిదా మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇప్పడు కూడా తన వైవిధ్యత కొనసాగిస్తూ.. అంతరిక్షం కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. దీంతో ఈ హీరోకి మెగా పెద్దల నుంచి ఈ మధ్యనే జ్ఞానోదయం జరిగించేలా క్లాసు ఒకటి పడిందట. క్లాస్ ఇమేజ్ పెంచుకోవడం అనే పాయింట్ మంచిదే అయినా.. అసలు మాస్ ఫ్యాన్స్ ను పట్టించుకోకపోవడం మాత్రం.. అస్సలు సరికాదని చెప్పుకొచ్చారట. క్లాస్ హీరో ఇమేజ్ తో కొన్ని హిట్స్ పడ్డాయి కాబట్టి.. ఇప్పుడు అయినా మాస్ సినిమాలపై దృష్టి పెట్టాలని సూచించారట ఆ మెగా పెద్దలు.

దీంతో ఇప్పుడు పక్కా మూవీ చేసేయాలని ఫిక్స్ అయిపోయాడట వరుణ్ తేజ్. తన దగ్గరకు వచ్చే దర్శకులు.. రచయితలను.. తనకు సూట్ అయ్యే విధంగా ఓ ఊరమాస్ కథ చెప్పాలని అడుగుతున్నాడట వరుణ్ తేజ్. పోకిరి తరహాలో కొత్తగా మెప్పించగలిగే విధంగా మాస్ కథ ఉండాలని చెబుతున్నాడట ఈ మెగా హీరో. మరి వరుణ్ తేజ్ కి మాస్ స్టోరీ ఇచ్చి మెప్పించే ఆ డైరెక్టర్ ఎవరో చూడాలి.