ఈ జనరేషన్ హీరోయిన్లు లక్కీ నాయనా!!

ఈ జనరేషన్ హీరోయిన్లు లక్కీ నాయనా!!

ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే హీరోయిన్లకు సినిమా కెరీర్ అయిపోయినట్లే. ఓ పదేళ్లు గ్యాప్ ఇచ్చిన తర్వాత తిరిగి ఎంట్రీ ఇవ్వదలచుకుంటే.. అక్క-వదిన-అమ్మ-అత్త పాత్రలకు షిఫ్ట్ కావాలనేది టాలీవుడ్ లో అప్రకటిత రూల్. రీసెంట్ టైం వరకూ ఇదే నడిచింది. కానీ ఇప్పుడీ లెక్కలు మారిపోతున్నాయి. బాలీవుడ్ మాదిరిగా ఎంత వయసు వచ్చినా అందాల భామలు మన దగ్గర కూడా హీరోయిన్ గా సత్తా చాటే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి.

పెళ్లి చేసుకున్న తర్వాత సమంత చేస్తున్న సినిమాలు చూస్తుంటే.. హిట్టు పర్సంటేజ్ పెరిగిందనే విషయం అర్ధమవుతుంది. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న శ్రియ కూడా లీడ్ రోల్ లో నటిస్తూ ఓ మూవీని స్టార్ట్ చేసింది. వీళ్లను చూస్తుంటే.. ఇప్పుడు పెళ్లి కాని సీనియర్ హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తారని అనడంలో ఆశ్చర్యం లేదు. త్రిష.. కాజల్ అగర్వాల్ లాంటి బ్యూటీలకు ఇప్పటికి కూడా మంచి డిమాండ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల నుంచి కాసింత బడ్జెట్ పెట్టగలిగితే మీడియం రేంజ్ హీరోల మూవీస్ లో కూడా నటించేందుకు అంగీకరించేస్తున్నారు.

ఒకవేళ హీరోయిన్ గా అవకాశాలు రాకపోతే.. స్పెషల్ అప్పియరెన్స్ అనో.. ఐటెం సాంగుల్లోనో కనిపించేస్తూ కెరీర్ కంటిన్యూ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మేకర్స్ కూడా సీనియర్ భామలతో ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తెరకెక్కించేందుకు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకులు సినిమా చూసే వైనం కూడా మారడం.. ఈ తరం హీరోయిన్లకు కెరీర్ మరో పదేళ్లు కొనసాగించే అవకాశం దక్కుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు