రాబోయే 10 ఏళ్లు టాలీవుడ్ వీళ్లదే

రాబోయే 10 ఏళ్లు టాలీవుడ్ వీళ్లదే

టాలీవుడ్ కి నాలుగు పిల్లర్స్ అనగానే.. చిరంజీవి.. బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్.. ఈ నాలుగు పేర్లు గుర్తుకు రావడంలో ఆశ్చర్యం లేదు. హిట్ పర్సంటేజ్.. వసూళ్ల స్థాయి.. ఏ విషయంలో చూసుకున్నా ఒకరితో ఒకరు పోటీ పడి.. తెలుగు సినీ పరిశ్రమకు నాలుగు స్తంభాలుగా నిలిచిన ఈ నలుగురు.. ఇప్పుడు సీనియర్ స్టార్లు అయిపోయారు.

మరి రాబోయే తరానికి ఎవరు ఈ పిల్లర్స్ గా నిలుస్తారనే అంచనాలు ఎక్కువయ్యాయి. పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు తేల్చేశాడు కాబట్టి.. ఆయనను పక్కన పెట్టేసి చూస్తే.. క్రేజ్ పరంగా మిగిలిన వారి కంటే ముందున్న హీరో మహేష్ బాబు. మహేష్ కు ఓ స్థానం ఇచ్చేసి మిగిలిన హీరోలను కౌంట్ చేయడంలో తప్పేమీ లేదు. జూనియర్ ఎన్టీఆర్ టాప్ స్టార్స్ జాబితాలో లేకపోతే.. ఈ లిస్ట్ కు అసలు అర్ధమే ఉండదు. ఆ తర్వాత రామ్ చరణ్ కు ప్లేస్ దక్కుతుంది. మగధీర తర్వాత అంతటి హిట్ లేదనే కొరత మొన్నటివరకూ వెంటాడింది కానీ.. ఇప్పుడు రంగస్థలంతో తన బాక్సాఫీస్ స్టామినా చూపించాడు మెగాపవర్ స్టార్.

ఇప్పుడు నాలుగు స్తంభాలు లెక్క గత చరిత్ర మాత్రమే అనుకోవాలి. ఎందుకంటే.. టాప్ రేంజ్ హీరోలుగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న హీరోలు మరో ఇద్దరు ఉన్నారు. బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ తో పాటు.. స్టైలిష్ స్టార్ అంటూ జనాలతో పిలిపించుకుంటూ నిలకడగా రేంజ్ పెంచుకున్న అల్లు అర్జున్ కూడా.. ఇప్పటికే టాప్ హీరోల కేటగిరిలో చేరిపోయారు. 1990లలో ఆ నలుగురు హీరోలదే రాజ్యం కాగా.. ఇప్పుడు రాబోయే 10 ఏళ్ల కాలం.. ఈ ఐదుగురు హీరోలు తమ రేంజ్ ను నిలబెట్టుకుంటూ కొనసాగే అవకాశం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English