అక్కడే ప్రమోషన్స్ ఎందుకు తేజూ?

అక్కడే ప్రమోషన్స్ ఎందుకు తేజూ?

సాయి ధరం తేజ్ కొత్త సినిమా వస్తోంది. తేజ్ ఐ లవ్యూ అంటూ కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని.. వచ్చే నెల 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా బాగానే సాగుతున్నాయి. రీసెంట్ గా వైజాగ్ లో కూడా ఓ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించగా.. తన సింప్లిసిటీతో హీరో విపరీతంగా ఆకట్టుకున్నాడు.

ఆ  తర్వాత కూడా ఏపీలో తన ప్రమోషన్ ను కంటిన్యూ చేస్తున్నాడు తేజు. పలు జిల్లాలలో కార్యక్రమాలకు పాల్గొంటున్నాడు. విజయవాడలో కూడా ఫ్యాన్స్ తో మీట్ అవుతున్నాడు. అయితే.. తేజు ఐ లవ్యూకు విషయంలో ప్రచారం అంతా ఏపీలోనే కాన్సంట్రేట్ చేసినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రచారం అంతగా కనిపించడం లేదు. మెగా హీరోలకు నైజాం ఏరియాలో వసూళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినా సరే.. ఎందుకో ఈ ఏరియాను కాసింత చిన్నచూపు చూస్తున్నాడేమో అనిపించక మానదు.

నైజాం అంటే ఎలాగూ గ్రిప్ ఉన్న ఏరియా కాబట్టి.. వసూళ్లు వస్తాయని అనుకుంటున్నాడో.. లేకపోతే ఏపీలో తన సినిమాలకు అంతగా వసూళ్లు రావడం లేదని భావిస్తున్నాడో చెప్పడం కష్టం కానీ.. తేజు ప్రమోషన్స్ మాత్రం ఏపీ కేంద్రంగానే సాగుతున్నాయి. ఇప్పుడు అనేక మంది మేకర్స్.. హైద్రాబాద్ లోనే కాకుండా.. తెలంగాణలోని ఇతర పట్టణాల్లో కూడా ప్రచార కార్యక్రమాలు.. ఈవెంట్లు నిర్వహించడం కనిపిస్తోంది. కానీ తేజు వైఖరి ఎందుకో విచిత్రంగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు