సోమవారం నుంచి సమ్మోహనం పాట్లు

సోమవారం నుంచి సమ్మోహనం పాట్లు

సమ్మోహనం చిత్రానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. నీట్‌ అయిన ఫ్యామిలీ సినిమా అంటూ విమర్శకులు మెచ్చుకున్న ఈ చిత్రానికి క్లాస్‌ ఆడియన్స్‌ నుంచి కూడా స్పందన బాగా వచ్చింది. దీంతో శని, ఆదివారాల్లో మంచి వసూళ్లు రాబట్టుకుంది. అయితే సోమవారం నుంచి సీజన్‌ ఎఫెక్ట్‌ ఈ చిత్రంపై బాగా కనిపిస్తోంది. స్కూళ్లు తెరిచేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ వర్కింగ్‌ డేస్‌లో థియేటర్ల వైపు రావడం లేదు.

దీని వల్ల వీక్‌ డేస్‌లో సమ్మోహనం చిత్రానికి సిటీస్‌లో కూడా చెప్పుకోతగ్గ వసూళ్లు రావడం లేదు. హైదరాబాద్‌లాంటి సెంటర్‌లో మెయిన్‌ థియేటర్‌లో కూడా ముప్పయ్‌ శాతం కంటే తక్కువ వసూళ్లు వస్తూ వుండడంతో హిట్‌ టాక్‌ వచ్చిన సినిమాకి మొదటి వారంలోనే ఈ పరిస్థితి ఏమిటని ట్రేడ్‌ వర్గాల వారు తెల్లమొహాలు వేస్తున్నారు. ఫ్యామిలీ సినిమాలని వేసవి సెలవుల్లో విడుదల చేయడం ఎంత అవసరమనేది ఈ చిత్రంతో ఇంకోసారి రుజువైంది. అయితే ఈ వారంలో చెప్పుకోతగ్గ సినిమాలేవీ విడుదల కావడం లేదు కనుక సమ్మోహనంకి సెకండ్‌ వీకెండ్‌ని క్యాష్‌ చేసుకునే వీలు చిక్కుతుంది.

తక్కువ బడ్జెట్‌ సినిమానే కనుక ఓవరాల్‌గా నిర్మాతకి చింత ఏమీ లేదు కానీ రైట్‌ టైమ్‌లో రిలీజ్‌ చేసి వుంటే మంచి లాభాలు చూసే అవకాశాన్ని చేతులారా మిస్‌ చేసుకున్నట్టయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు