వరుణ్‌ తేజ్‌ సినిమాని దెబ్బ కొడుతుందా?

వరుణ్‌ తేజ్‌ సినిమాని దెబ్బ కొడుతుందా?

వరుసగా రెండు విజయాలు అందుకున్న మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ఆ తర్వాత మరో ప్రేమకథో, కమర్షియల్‌ కథో ఎంచుకోకుండా స్పేస్‌ థ్రిల్లర్‌ చేస్తున్నాడు. ఘాజీ దర్శకుడు సంకల్ప్‌ రెడ్డితో వరుణ్‌ చేస్తోన్న సినిమాని దేశంలోనే మొట్టమొదటి స్పేస్‌ సినిమాగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ చిత్రం నిర్మాణ దశలో వుండగానే మరో స్పేస్‌ థ్రిల్లర్‌ రిలీజ్‌కి రెడీ అయిపోయింది.

తమిళంలో జయం రవి హీరోగా రూపొందిన 'టిక్‌ టిక్‌ టిక్‌' చిత్రం భారతీయ సినిమా చరిత్రలో మొట్టమొదటి స్పేస్‌ చిత్రమట. ఈ శుక్రవారం తమిళం, తెలుగులో విడుదలవుతోన్న ఈ చిత్రానికి ఈ ప్రచారం బలంగా జరుగుతోంది. మరి రెండు సినిమాల కథ ఏమిటనేది తెలియదు కానీ ఖచ్చితంగా కొందరు ప్రేక్షకులకి అయినా వరుణ్‌ తేజ్‌ సినిమా కొత్త కాన్సెప్ట్‌ కాదనే ఫీలింగ్‌ని 'టిక్‌ టిక్‌ టిక్‌' తెచ్చే అవకాశముంది.

ఈ చిత్రం కనుక క్లిక్‌ అయితే వరుణ్‌ తేజ్‌ చిత్రాన్ని మరింత జాగ్రత్తగా రూపొందించాల్సి వుంటుంది. నిజానికి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలని అనుకున్నా కానీ వరుణ్‌ తేజ్‌ సినిమా కాన్సెప్ట్‌ తెలిసి డబ్బింగ్‌ చేసి విడుదల చేసేస్తున్నారు. మరి ఈ టిక్‌ టిక్‌ టిక్‌ ఎలాగుంటుందో, దీని వల్ల వరుణ్‌ సినిమాపై ఎంత ప్రభావం పడుతుందో అనేది కొంతకాలం ఆగితే కానీ తెలియదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు