దేవరకొండ గాలి ఆమెకీ సోకింది

దేవరకొండ గాలి ఆమెకీ సోకింది

విజయ్‌ దేవరకొండ ఏది చేసినా సంచలనమే. యువతకి నచ్చేలా రెబల్‌లా వ్యవహరించే విజయ్‌ తనకి ఫిలింఫేర్‌ అవార్డ్‌ ఇచ్చినా కానీ దానిని ఒక ప్రత్యేకమైన వార్త చేసేసాడు. అవార్డుని వేలం వేస్తానని, సిఎం రిలీఫ్‌ ఫండ్‌కి ఇస్తానని తనదైన శైలిలో రియాక్ట్‌ అయ్యాడు. అతనికి అవార్డు వచ్చిందనే న్యూస్‌ చూసి విజయ్‌తో 'గీత గోవిందం'లో నటిస్తోన్న రష్మిక మందాన ట్విట్టర్‌లో థాంక్స్‌ చెప్పింది.

దానికి బదులుగా 'మేడమ్‌, గీతా మేడమ్‌. మీతో టైమ్‌ గడపడం నాకు నిజమైన అవార్డ్‌ మేడమ్‌. ఇలాంటి అవార్డులు వస్తుంటాయి పోతుంటాయి' అన్నాడు. దానికి రష్మిక గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. 'ఇగో గోవిందం, ఈ ఓవరాక్షనే తగ్గించుకోమంది. అసలు నీకు కాదు... ప్రభాస్‌కో, తారక్‌కో ఇస్తే మాకు ఈ గొడవ పోయేది' అని అతని స్టయిల్లోనే బదులివ్వడంతో ఈ ఫన్నీ కాన్వర్‌జేషన్‌ని వాళ్ల ఫాలోవర్స్‌ ఎంజాయ్‌ చేసారు.

రష్మికకి కూడా విజయ్‌ గాలి సోకిందని, అతనిలానే మాట్లాడుతోందని నవ్వుకున్నారు. అయితే వీళ్లిద్దరూ తెలివిగా 'గీత గోవిందం' చిత్రానికి ఇలా వెరైటీ పబ్లిసిటీ చేసారనే సంగతి కనిపెట్టకుండా లేరనుకోండి. ఏదేమైనా ప్రమోషన్స్‌ విషయంలో, వైరల్‌ అయ్యే వ్యవహారంలో విజయ్‌ దేవరకొండ దగ్గర చాలానే ఐడియాలున్నట్టున్నాయి. ఎంతయినా ఈ జనరేషన్‌ హీరో కదా.