సుధీర్ బాబు ఆ క్లబ్బులోకి చేరాడు

సుధీర్ బాబు ఆ క్లబ్బులోకి చేరాడు

హీరోగా నిలదొక్కుకోవడానికి ఆరేడేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు సుధీర్ బాబు. కానీ అతడికి సరైన విజయాలు దక్కలేదు. కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్టు ‘ప్రేమకథా చిత్రమ్’ మాత్రమే. కానీ దాని వల్ల అతడికొచ్చిన పేరంటూ ఏమీ లేదు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రంలో నటుడిగా పేరు సంపాదించాడు కానీ.. ఆ సినిమా పెద్ద ఫ్లాపైంది. సినిమా హిట్టవడమే కాక తనకు పేరు కూడా తెచ్చే పెట్టే చిత్రం కోసం అతను ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు అతడి కోరిక ఫలించింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్వకత్వంలో సుధీర్ నటించిన ‘సమ్మోహనం’ అన్ని రకాలుగా మంచి ఫలితం అందించింది. ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని చక్కటి ఓపెనింగ్స్ సంపాదించింది. ఇప్పటికే దాదాపుగా బయ్యర్లందరూ సేఫ్ అయిపోయారు.


ముఖ్యంగా అమెరికాలో ‘సమ్మోహనం’ అదరగొడుతోంది. తక్కువ మొత్తానికి హక్కులు తీసుకున్న బయ్యర్ ఇప్పటికే లాభాల్లోకి వచ్చేశాడు. ఎలాంటి స్టార్ అట్రాక్షన్ లేని ఈ చిత్రం ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్కును అందుకోవడం విశేషం. సోమవారం నాటికి 4.3 లక్షల డాలర్ల దాకా వసూలు చేసిన ‘సమ్మోహనం’ మంగళవారం ఆఫర్ల సపోర్టుతో మంచి వసూళ్లు రాబట్టింది. హాఫ్ మిలియన్ మార్కును దాటేసింది. ఈ వారం రాబోతున్న ‘జంబలకిడి పంబ’ యుఎస్‌లో పెద్దగా ప్రభావం చూపించే అవకాశాలు లేవు. కాబట్టి రెండో వీకెండ్లో కూడా ‘సమ్మోహనం’ జోరు కొనసాగే అవకాశముంది. ఈ చిత్రం ఫుల్ రన్లో 8 లక్షల డాలర్ల మార్కును టచ్ చేస్తుందని భావిస్తున్నారు. సుధీర్ బాబు స్థాయికి ఇది పెద్ద ఘనతే అవుతుంది. అతడి కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్‌గా చాన్నాళ్ల పాటు నిలిచే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు