ప్రివ్యూలు వేస్తే ‘పెళ్ళిచూపులు’ కన్నా మంచి రెస్పాన్స్

ప్రివ్యూలు వేస్తే ‘పెళ్ళిచూపులు’ కన్నా మంచి రెస్పాన్స్

తొలి సినిమా ‘పెళ్ళిచూపులు’తో గొప్ప పేరే సంపాదించాడు తరుణ్ భాస్కర్. డెబ్యూ మూవీ అంత పెద్ద హిట్టయ్యాక అవకాశాలు వెల్లువెత్తుతాయి. చకచకా సినిమాలు తీయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఐతే తరుణ్ మాత్రం ఆశ్చర్యకరంగా బాగా గ్యాప్ తీసుకున్నాడు. ఏడాదికి పైగా ఖాళీగా ఉన్నాడు. పేరున్న హీరోలతో కాకుండా దాదాపుగా అందరూ కొత్త వాళ్లతో ఓ సినిమా మొదలుపెట్టాడు. అదే.. ఈ నగరానికి ఏమైంది. తన తొలి సినిమాను రిలీజ్ చేసిన సురేష్ బాబు నిర్మాణంలో ఈ సినిమా తీశాడు తరుణ్. ఈ సినిమా మొదలవడానికి ముందు ఏం జరిగిందో.. ఈ సినిమా కథేంటో చూచాయిగా చెప్పే ప్రయత్నం చేశాడు తరుణ్.

‘పెళ్ళిచూపులు’ తర్వాత ఎలాంటి సినిమాలో చేయాలో తనకు అర్థం కాలేదని.. అందుకే గ్యాప్ వచ్చిందని తరుణ్ భాస్కర్ చెప్పాడు. అలాంటి సమయంలో వెళ్లి సురేష్ బాబును కలిస్తే నీ ఇష్టం వచ్చింది రాస్కో అన్నాడని.. ఆయన ఆ మాట చెప్పడంతో తనకు భయమేసిందని అన్నాడు. ఐతే మనకు తెలిసిన కథే రాద్దాం అనుకుని కూర్చున్నానని.. షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి యువ దర్శకులు పడే కష్టాలు.. ఆ ప్రయాణాన్ని సినిమాగా చూపిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించానని.. ఇప్పటివరకు తెలుగులో ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇది కొత్తగా ఉంటుందని ఆశిస్తున్నానని తరుణ్ తెలిపాడు. తాను షార్ట్ ఫిలిం బ్యాగ్రౌండ్ నుంచే వచ్చానని.. తనలా ఇంకా చాలామంది ఆ నేపథ్యం నుంచే వచ్చి సినిమాలు చేస్తున్నారని అన్నాడు.

కథ పూర్తి చేసి ఫస్ట్ డ్రాఫ్ట్ సురేష్ బాబుకు వినిపించానని.. ఆయన ఓకే అన్నారని.. నిజంగా ఆయన సరే అన్నారా అని నమ్మలేదని.. తన టీంకు చెబితే వాళ్లు కూడా లైట్ తీసుకున్నారని.. కానీ ఒక రోజు సడెన్‌గా షూటింగ్ మొదలుపెట్టుకోండి అని చెప్పి సురేష్ షాకిచ్చారని తరుణ్ వెల్లడించాడు. సినిమా ఫస్ట్ కాపీ చూసి సురేష్ చాలా ఇంప్రెస్ అయ్యారని.. ప్రివ్యూలు వేస్తే ‘పెళ్ళిచూపులు’ కన్నా మంచి రెస్పాన్స్ వచ్చిందని తరుణ్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు