బోయపాటి రాత చరణ్ మారుస్తాడా?

బోయపాటి రాత చరణ్ మారుస్తాడా?

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్టు తీస్తే బోయపాటి శ్రీను పేరు కచ్చితంగా ఉంటుంది. ఎస్.ఎస్.రాజమౌళి, కొరటాల శివల తర్వాత బెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న పెద్ద దర్శకుడు బోయపాటే. ‘దమ్ము’ మినహాయిస్తే అతడి కెరీర్లో పూర్తిగా నిరాశ పరిచిన సినిమానే లేదు. మిగతావన్నీ వాటి వాటి స్థాయిలో బాగానే ఆడాయి. ఐతే ఇంత మంచి సక్సెస్ రేట్ ఉన్నప్పటికీ మిగతా స్టార్ డైరెక్టర్లకు దక్కిన గౌరవం బోయపాటికి దక్కలేదు. ఇందుక్కారణం అతడి సినిమాలన్నీ ఒక మూసలో ఉండటమే.

ప్రధానంగా మాస్ ప్రేక్షకుల్నే లక్ష్యంగా చేసుకుని సినిమాలు తీస్తాడతను. పెద్దగా కొత్తదనం చూపించలేడు. క్లాస్ ప్రేక్షకులకు అతడి సినిమాలు అంతగా రుచించవు. అమెరికాలో ఎప్పుడూ కూడా బోయపాటి సినిమాలు సరిగా ఆడవు. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫలితాలందుకున్న బోయపాటి సినిమాలన్నీ అమెరికాలో తుస్సుమన్నవే. ‘సరైనోడు’ లాంటి బ్లాక్ బస్టర్ కూడా అక్కడ సరిగా ఆడలేదు. మిగతా సినిమాల గురించి చెప్పాల్సిన పని లేదు.

ఇలాంటి తరుణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో జట్టు కట్టాడు బోయపాటి. చరణ్ కూడా ఇంతకుముందు యుఎస్ బాక్సాఫీస్‌లో బాగా వీకే. కానీ ‘ధృవ’.. ‘రంగస్థలం’ సినిమాలు అతడి రాత మార్చేశాయి. అక్కడ భారీ విజయాలందుకున్నాయి. ‘రంగస్థలం’ ఏకంగా 3.5 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ఈ నేపథ్యంలో చరణ్‌కు అక్కడ మార్కెట్ బాగానే పెరిగింది. ఐతే బోయపాటితో సినిమా చేస్తున్న నేపథ్యంలో అతడి మార్కెట్ క్యారీ అవుతుందా.. ఈ సినిమాకు అమెరికాలో ఆదరణ దక్కుతుందా అన్నది సందేహం. మరి చరణ్ బోయపాటి రాత మారుస్తాడా.. లేక బోయపాటి తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్ చరణ్‌పై పడి అతను పూర్వ స్థితికి చేరుతాడా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు