పాదయాత్ర రేంజ్ లో ఫుల్లు స్పీడే!!

పాదయాత్ర రేంజ్ లో ఫుల్లు స్పీడే!!

వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలో.. ఆయన చేసిన పాదయాత్ర అత్యంత కీలకమైన ఘట్టం. ఆయనను ముఖ్యమంత్రి పీఠానికి చేర్చడమే కాదు.. జనాలలో వైఎస్ కు అమితమైన ఖ్యాతిని అందించిన యాత్ర అది. అందుకే ఆయన బయోపిక్ ను రూపొందిస్తున్న మేకర్స్.. యాత్ర అనే టైటిల్ తోనే సినిమా చేస్తున్నారు.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.. వైఎస్ఆర్ పాత్రలో నటిస్తుండడంతో ఈ ప్రాజెక్టుకు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఏప్రిల్ 9న ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాగా.. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ ను చెప్పేశారు మేకర్స్. జూన్ 20 నుంచి.. అంటే రేపటి నుంచి యాత్ర షూటింగ్ ప్రారంభం కానుందట. అయితే.. ఎక్కడా బ్రేక్ అనేదే లేకుండా.. సింగిల్ షెడ్యూల్ లోనే మూవీని పూర్తి చేయాలని తలపెట్టారట. వైఎస్ ఎలాగైతే ఆపకుండా యాత్ర సాగించారో.. సినిమాను కూడా అలాగే సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయనున్నారట.

సెప్టెంబర్ వరకూ సాగే ఒకే ఒక షెడ్యూల్ తో మూవీ షూటింగ్ పూర్తి చేసేయాలని నిర్ణయించాడు దర్శకుడు మహి వి రాఘవ. ఇందుకోసం పక్కాగా ప్లానింగ్ చేసుకుని షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చెబుతున్నాడు. 2003లో 60 రోజుల పాటు మండుటెండల్లో 1500కిలోమీటర్ల పాటు వైఎస్ చేసిన పాదయాత్రను బేస్ చేసుకుని ఈ మూవీలో ప్రధాన భాగం సాగనుంది. రీసెంట్ గా మహి వి రాఘవ తెరకెక్కించిన ఆనందో బ్రహ్మ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు