సెక్స్ కథలు రకుల్ కి నచ్చేశాయ్

సెక్స్ కథలు రకుల్ కి నచ్చేశాయ్

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో కుదురుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అవకాశం దొరికితే చాలు.. అందాల ప్రదర్శనతో పాటు బాలీవుడ్ ను అందలం ఎక్కించేలా పొగడ్తల వర్షం కురిపించేందుకు ఏ మాత్రం సంశయించడం లేదు.

ఇప్పుడు హిందీలో వస్తున్న లస్ట్ స్టోరీస్ ఎంతటి సంచలనం సృష్టిస్తోందో చెప్పాల్సిన పని లేదు. ఆన్ లైన్ సిరీస్ అయినా.. సెన్సేషన్స్ సృష్టిస్తోంది. పైగా రాధికా ఆప్టే.. నేహా ధూపియా.. కైరా అద్వానీ లాంటి క్రేజీ భామలు వీటిలో యాక్ట్ చేస్తుండడం.. ఈ సెక్స్ కథలకు మరింతగా క్రేజ్ తీసుకొచ్చింది. వైబ్రేటర్ తో స్వయంతృప్తి పొందే భామగా కైరా అద్వానీ నటించడం ఎంతగా వైరల్ అయిందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ లస్ట్ స్టోరీస్ పేరుతో ప్రసారం అవుతున్న సెక్స్ కథలు రకుల్ ప్రీత్ కి తెగ నచ్చేశాయి. అందుకే వాటిని తెగ పొగిడేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ కూడా పెట్టింది.

కథలు చెప్పడంలో లస్ట్ స్టోరీస్ మరో అడుగు ముందుకేసిందని అన్న రకుల్.. మనిషి కోరికల గురించి చెప్పడం కోసం హద్దులను చెరిపేస్తున్న వైనం హైలైట్ అంటోంది. ఇప్పటివరకూ ఆయా పాత్రలలో నటించిన యాక్టర్లు.. తెరకెక్కించిన మేకర్స్ అందరిని ట్యాగ్ చేస్తూ పొగిడేసింది రకుల్ ప్రీత్ సింగ్. థ్యాంక్యూ చెబుతూ కైరా అద్వానీ నుంచి రిప్లై కూడా వచ్చింది. సెక్స్ స్టోరీస్ కే ఇంత ప్రశంసలు అంటే.. బాలీవుడ్ న్యూస్ లో భాగం అయ్యే ఏ చిన్న అవకాశాన్ని రకుల్ వదిలిపెట్టేట్లుగా లేదు కదూ!


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English