మహానటితో బ్రేకొచ్చింది... బ్రేక్‌ పడింది!

మహానటితో బ్రేకొచ్చింది... బ్రేక్‌ పడింది!

మహానటి ఘన విజయంతో కీర్తి సురేష్‌ పరవశించిపోతోంది. సావిత్రి పాత్రలో జీవించేసిందనే ప్రశంసల జడి నుంచి ఆమె ఇంకా బయట పడలేదు. అయితే నటిగా ఇంకా పరిణతి చెందుతోన్న దశలో వుండగానే కీర్తి సురేష్‌కి ఇంతటి కీర్తి ప్రతిష్టలు రావడంతో ఆమె కెరియర్‌కి అనూహ్యమైన బ్రేక్‌ పడింది. ఈ చిత్రం చూసిన తర్వాత కీర్తికి అల్లాటప్పా పాత్రలు ఎవరూ ఆఫర్‌ చేయడం లేదు.

నటిగా తన స్థాయికి తగ్గ పాత్ర వుంటే ఆమెని కన్సిడర్‌ చేద్దామని చూస్తున్నారు. మరోవైపు కీర్తి కూడా గ్లామర్‌ ప్రధాన పాత్రల మీద ఆసక్తి చూపించడం లేదు. 'అజ్ఞాతవాసి' డిజాస్టర్‌ అవడంతో పాటు తనకి కూడా చాలా చెడ్డ పేరు తెచ్చింది. స్టార్‌ ఎట్రాక్షన్‌ వుందని అలాంటి సినిమాలు చేయడం కంటే ఖాళీగా వుండడమే ఉత్తమమని ఆమె భావిస్తోంది. అయితే వెంటవెంటనే కొత్త సినిమాలు సైన్‌ చేయకపోతే కీర్తి అనే ఓ హీరోయిన్‌ వుందనే సంగతి కూడా మరచిపోయే ప్రమాదముంది.

ఈ విషయంలో అనుష్కని చూసి కీర్తి నేర్చుకోవాలి. అరుంధతి లాంటి చిత్రాలు వచ్చినా కానీ గ్లామర్‌ పాత్రలకి అనుష్క దూరం కాలేదు. రెండు రకాల సినిమాలని బ్యాలెన్స్‌ చేసుకుంటూ వచ్చింది కనుకే బాహుబలి, భాగమతి లాంటి చిత్రాలొచ్చాయి. ఒక ఫ్లాప్‌ వచ్చిందనే భయంతో ఇక అలాంటివి చేయనని భీష్మించుకుంటే ఒకే హిట్టుతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు