టాలీవుడ్‌ ట్రేడ్‌: టాక్‌ రాకపోతే మటాష్‌

టాలీవుడ్‌ ట్రేడ్‌: టాక్‌ రాకపోతే మటాష్‌

తెలుగు సినిమా బిజినెస్‌ పరంగా ప్రస్తుతం నెలకొన్న ట్రెండ్‌ ట్రేడ్‌ వర్గాలని విస్మయపరుస్తోంది. సినీ వ్యాపారం మీద ఆధార పడిన వారికి ఈ కొత్త ట్రెండ్‌తో చుక్కలు కనిపిస్తున్నాయి. పేరున్న సినిమాలకి అయితే వసూళ్లు ఎలాగోలా వచ్చేస్తున్నాయి. అదే మధ్య శ్రేణి, చిన్న బడ్జెట్‌ చిత్రాలకి అయితే విడుదలకి ముందు క్రేజ్‌ రాకపోతే ఇక ఓపెనింగ్‌ కూడా రావడం లేదు. అలాంటి సినిమాలకి కనుక బ్యాడ్‌ టాక్‌ వచ్చినట్టయితే మర్నాటికే థియేటర్ల రెంట్లు కూడా వసూలు కాని పరిస్థితి వస్తోంది.

తెలియని హీరోల చిత్రాలకి ఇలా జరిగితే కంగారు పడాల్సిన పని లేదు కానీ పేరున్న హీరోల చిత్రాలకే ఈ తరహా వ్యాపారం జరుగుతోంటే మార్కెట్‌ వర్గాల్లో వణుకు పుడుతోంది. ఆఫీసర్‌ చిత్రానికి మొదటి రోజే డెఫిసిట్లు పడిన థియేటర్లున్నాయి. నాగార్జునలాంటి హీరో సినిమాకి ఇలా జరగడమేంటి అనుకున్నారు. దాంతో పాటే విడుదలైన 'రాజుగాడు'ని ఎవరూ పట్టించుకోలేదు కానీ దాని పరిస్థితి కూడా దాదాపు అంతే.

రాజ్‌ తరుణ్‌ తెలియని హీరో ఏమీ కాదు. హిట్‌ సినిమాల్లో నటించిన రాజ్‌ తరుణ్‌ చిత్రానికి కనీసపు వసూళ్లు కూడా రాక చాలా చోట్ల ప్రింట్లు, పబ్లిసిటీ ఖర్చులు కూడా వసూలవలేదు. కళ్యాణ్‌రామ్‌ నటించిన 'నా నువ్వే' పరిస్థితి కూడా డిట్టో. ఈ చిత్రానికి రెండవ రోజుకే కలక్షన్లు కరిగిపోయాయి. అతని సినిమాల్లోనే అతి పెద్ద పరాజయంగా మిగిలిన 'నా నువ్వే'తో కళ్యాణ్‌రామ్‌ మార్కెట్‌ కుదేలయింది. దీంతో మీడియం బడ్జెట్‌ చిత్రాలు కొనడానికి కూడా బయ్యర్లు జంకే పరిస్థితి వచ్చింది. జూన్‌లో బిజినెస్‌ డల్‌గా వుంటుంది కనుక ఇదంతా దాని వల్లేనని సరిపెట్టుకుంటున్నారు. జులై, ఆగస్టులో కూడా ఇదే సిట్యువేషన్‌ రిపీట్‌ అయితే మాత్రం సినిమా బిజినెస్‌పై దారుణమైన ఎఫెక్ట్‌ వుంటుందని ట్రేడ్‌ పండితులు హెచ్చరిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు