మహేష్‌బాబు మరో చిరంజీవి అవుతున్నాడా?

మహేష్‌బాబు మరో చిరంజీవి అవుతున్నాడా?

తెలుగు చిత్ర పరిశ్రమకి నెక్స్‌ట్‌ నంబర్‌వన్‌ ఎవరంటే ప్రస్తావనకి తప్పక వచ్చే పేరు మహేష్‌బాబు. ప్రస్తుతానికి టాలీవుడ్‌ టాప్‌ ప్లేస్‌ ఎవరిదనే దానిపై క్లారిటీ లేదు కానీ మహేష్‌ మాత్రం 'పెద్దన్న' బాధ్యతలు తీసేసుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఎవరి సినిమా హిట్టయినా, ఏ చిన్న సినిమా బాగా ఆడుతున్నా చిరంజీవి ఆ చిత్ర బృందాన్ని తప్పక అభినందించేవారు. ఈ జనరేషన్‌లో ఆ అలవాటు మహేష్‌ చేసుకుంటున్నాడు.

గతంలో కంటే మహేష్‌ ఇప్పుడు ఇతర చిత్రాలని ఎక్కువ ఎంకరేజ్‌ చేస్తున్నాడు. తన పోటీదారుడు అయినా కానీ చరణ్‌ చిత్రం రంగస్థలం పెద్ద హిట్‌ అయితే అందరికంటే ముందుగా మహేష్‌ అభినందించాడు. మహానటి, సమ్మోహనం లాంటి చిత్రాలకి కూడా మహేష్‌ 'మాట' పబ్లిసిటీ పరంగా బాగా హెల్ప్‌ అయింది. స్ట్రెయిట్‌ చిత్రాలకే కాకుండా మహేష్‌ అనువాద చిత్రాలకి కూడా మాట సాయం చేస్తున్నాడు.

ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న విశాల్‌, సమంతల అభిమన్యుడు చిత్రంపై మహేష్‌ ప్రశంసలు కురిపించాడు. అనువాద చిత్రం కావడంతో చాలా మంది దృష్టిలో పడని అభిమన్యుడుకి మహేష్‌ కాంప్లిమెంట్స్‌ ఖచ్చితంగా ప్లస్‌ అవుతాయి. మంచి సినిమాలు ఎక్కడ వున్నా స్వయంగా చూసి మరీ వాటిని ప్రశంసిస్తూ, తద్వారా వాటి విజయానికి తోడ్పాటునిస్తోన్న మహేష్‌ మాదిరిగా మిగతా హీరోలు కూడా అన్ని సినిమాలనీ ఎంకరేజ్‌ చేస్తే పరిశ్రమ మరింత కళకళలాడుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English