మహేష్ యాక్టివ్ అయిపోతే ఇలా ఉంటుంది

మహేష్ యాక్టివ్ అయిపోతే ఇలా ఉంటుంది

మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా కాలంగా ఉన్నాడు. అత్యధికంగా ఫాలోయర్స్ కలిగిన టాలీవుడ్ స్టార్స్ లో మహేష్ టాప్ లోనే ఉంటాడు. అయితే.. మన సూపర్ స్టార్ నుంచి వచ్చే అప్ డేట్స్ చాలా తక్కువగా ఉండేవి. తన సినిమా రిలీజ్ సమయంలో మినహాయిస్తే.. అంతగా స్పందించేవాడు కాదు. ఒక్కో సమయంలో అయితే నెలల పాటు ఒక్క పోస్ట్ కూడా ఉండేది కాదు. కాకపోతే ఈ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ కాసింత ట్రై చేస్తూనే ఉంటుంది.

కానీ కొంత కాలంగా మహేష్ విపరీతంగా యాక్టివ్ అయిపోయాడు. ఇప్పుడు తన సినిమాలపైనే కాదు.. ఇతర హీరోల చిత్రాలపై కూడా ట్వీట్లు పెడుతున్నాడు. తాజాగా సమ్మోహనం మూవీ గురించి మహేష్ పోస్ట్ చేస్తున్న ట్వీట్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. తన బావ సినిమా అని మాత్రమే కాకుండా.. సమ్మోహనం మూవీ మహేష్ ను ఎంతగా మురిపించిందో ఈ ట్వీట్స్ చూస్తే అర్ధమవుతుంది. ఇప్పుడు విశాల్- సమంత జంటగా నటించిన అభిమన్యుడు మూవీలో కంటెంట్ గురించి.. యాక్టింగ్ గురించి కూడా రియాక్ట్ అయ్యాడు మహేష్ బాబు.

రంగస్థలం మూవీ విషయంలో కూడా ఇలాగే ప్రశంసలు కురిపించాడు మహేష్. ఇదంతా చూస్తుంటే.. అసలు ఈ మధ్య కాలంలో వస్తున్న ఏ ఒక్క సినిమాను చూడకుండా సూపర్ స్టార్ వదిలిపెట్టడం లేదని అనిపించక మానదు. కాన్సెప్ట్ ఏదైనా.. కారణాలు ఎన్నున్నా.. మహేష్ ఇంత యాక్టివ్ గా మారిపోవడం మాత్రం ఫ్యాన్స్ కు తెగ హుషారు ఇస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు