బాలీవుడ్ కరువు మామూలుగా లేదు

బాలీవుడ్ కరువు మామూలుగా లేదు

బాలీవుడ్ కి ఈ ఏడాది అసలే మాత్రం కలిసి రాలేదు. పద్మావత్ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా భారీ హిట్ సాధించలేదు. బాఘీ2 లాంటి చిత్రాలు మంచి వసూళ్లే రాబట్టినా.. అవి బాక్సాఫీస్ మెరుపులకు సరిపోలేదు.

తాజాగా విడుదల అయిన సల్మాన్ ఖాన్ మూవీ రేస్3.. భీకరంగా వసూళ్లను రాబట్టేస్తోంది. తొలి రోజున ఈ సినిమా 29.17 కోట్లు.. శనివారం 38.14 కోట్లు.. ఆదివారం 39.14 కోట్లు రాబట్టిన ఈ మూవీ.. సోమవారం నాడు నెమ్మదించింది. సోమవారం రోజున ఈ సినిమాకు 14.24 కోట్ల వసూళ్లు వచ్చాయి. మాస్ ఏరియాల్లోనూ.. సింగిల్ స్క్రీన్స్ లోను కలెక్షన్స్ ను నిలబెట్టుకున్న ఈ చిత్రం.. మల్టీప్లెక్సుల్లో డౌన్ అయింది. అయితే.. మొత్తం మీద ఇప్పటివరకూ నాలుగు రోజుల్లో వచ్చిన 120.71 కోట్ల కలెక్షన్స్ ను చూస్తే.. రేస్3 ఏ స్థాయిలో సత్తా చాటుతుందో అర్ధమవుతుంది.

ఇదందా రేస్3 గొప్పదనం అనుకుంటే కచ్చితంగా పొరపాటే. ఎందుకంటే.. ఈ చిత్రానికి అటు రివ్యూల నుంచి ఇటు మౌత్ టాక్ వరకూ ఏ ఒక్కటీ బాగాలేదు. అయినా సరే.. సల్లూభాయ్ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడానికి కారణం.. బాలీవుడ్ లో సరైన సినిమా వచ్చి చాలా కాలం అయిపోవడమే. ఇంకా స్ట్రెయిట్ గా చెప్పాలంటే.. భారీ సినిమాల విషయంలో బాలీవుడ్ ఇప్పుడు మామూలు కరువులో లేదు. సినిమాల్లేక.. బాగాలేదన్న సినిమా రేస్3 కూడా బాక్సాఫీస్ ను కుమ్మేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు