త్రిషకు అనుకూలంగా కోర్టు తీర్పు

త్రిషకు అనుకూలంగా కోర్టు తీర్పు

ఫిలిం సెలబ్రెటీలు సెలబ్రెటీలు పన్ను చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడి ఇన్‌కం ట్యాక్స్ అధికారుల దృష్టిలో పడటం.. కేసుల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ఆ మధ్య పన్ను మినహాయింపు కోసం అమలాపాల్ పుదుచ్చేరిలో చేసిన నిర్వాకం సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ త్రిష సైతం కొన్నేళ్ల కిందట ఇలాంటి కేసులోనే చిక్కుకుంది. 2011-12 వార్షిక సంవత్సరానికి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు విషయంలో త్రిష అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపిస్తూ ఆమెపై కేసు వేశారు అధికారులు.

ఆ ఏడాది తన ఆదాయం రూ.89.69 లక్షలని చూపిస్తూ ఆ మేరకు పన్ను కట్టింది త్రిష. కానీ తర్వాత ఏడాది మాత్రం ఏకంగా రూ.4.4 కోట్ల ఆదాయం చూపించి ఆమేరకు పన్నులు చెల్లించింది. ఐతే ముందు ఏడాది ఆదాయానికి.. దీనికి అసలు పొంతన లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. 2011-12 ఆదాయాన్ని తగ్గించి చూపించి.. పన్ను ఎగ్గొట్టిందని భావించారు. ఆమె రికార్డులన్నీ పరిశీలించి త్రిషకు రూ.1.16 కోట్ల మేర జరిమానా విధించారు. ఐతే దీనిపై త్రిష కోర్టుకెక్కింది.

ఈ కేసు కొన్నేళ్లుగా కోర్టులో ఉంది. చివరికి ఈ కేసులో తీర్పు త్రిషకు అనుకూలంగా రావడం విశేషం. తాజాగా చెన్నై కోర్టు త్రిషకు ఊరటనిచ్చే తీర్పు ఇచ్చింది. త్రిష ఎలాంటి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆధారాలు లేవని.. కొన్నిసార్లు ఫ్యూచర్ ప్రాజెక్టులకు సంబంధించి ముందే అడ్వాన్సులు తీసుకోవడం వల్ల ఒక ఏడాది ఎక్కు ఆదాయం ఆర్జించి ఉండొచ్చని.. అంతమాత్రాన ముందు ఏడాది తక్కువ ఆదాయం వస్తే దాన్ని అనుమానించాల్సిన పని లేదని కోర్టు స్పష్టం చేసింది. ఎన్నో ఏళ్లుగా నానుతున్న కేసు ఎట్టకేలకు పరిష్కారమై తనకు అనుకూలంగా తీర్పు రావడంతో ఊపిరి పీల్చుకుంది త్రిష.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English