మహేష్ డబ్బింగ్ సినిమా చూశాడు

మహేష్ డబ్బింగ్ సినిమా చూశాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు వేరే తెలుగులో వేరే హీరోల సినిమాలు చూసి వాటి గురించి స్పందించడమే తక్కువ. తన సినిమాల గురించో.. తన బావ సుధీర్ బాబు సినిమాల గురించో మాత్రమే ట్విట్టర్లో స్పందిస్తుంటాడు. చాలా కాలం తర్వాత ఇటీవలే అతను ‘సమ్మోహనం’ సినిమా చూసి దానిపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఐతే సూపర్ స్టార్ ఇప్పుడు ఒక డబ్బింగ్ సినిమా చూసి దాన్ని పొగుడుతూ ట్వీట్ చేయడం విశేషం. ఆ సినిమా మరేదో కాదు.. విశాల్ లేటెస్ట్ హిట్ ‘అభిమన్యుడు’.

అభిమన్యుడు సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని.. మిత్రన్ డైరెక్షన్, విజన్ విషయంలో గొప్ప నైపుణ్యం కనిపించిందని.. ఎంతో పరిశోధించి తీసిన ఈ సినిమా తీసిన విషయం అర్థమవుతోందని.. సినిమా మంచి వేగంతో సాగుతుందని మహేష్ అన్నాడు. విశాల్‌కు, అతడి టీంకు హృదయపూర్వక అభినందనలు చెప్పాడు మహేష్. ఐతే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగుస్తుండగా.. మహేష్ దీనిపై స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అసలు ఈ చిత్రంలో మహేష్‌కు ఏ సంబంధం లేదు. విశాల్‌తో ఏదైనా స్నేహం ఉండి ట్వీట్ చేశాడేమో అనుకుందామా అంటే.. ఈ పని కొంచెం ముందే చేసి ఉండాలి. అతను ట్వీట్ చేసిన టైమింగ్ ప్రకారం చూస్తే ఇది ప్రమోషన్ కోసం చేసినట్లుగా అనిపించడం లేదు. ఊరికే ఆసక్తి కలిగి సినిమా చూసి స్వచ్ఛందంగానే స్పందించినట్లుగా అనిపిస్తోంది. అదే నిజమైతే మహేష్ ఇలా స్పందించిన తొలి సినిమా ఇదే అవుతుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు