బాహుబలి2కి పోటీ రంగస్థలమేనా?

బాహుబలి2కి పోటీ రంగస్థలమేనా?

ఏ రికార్డు కూడా శాశ్వతం కాదు.. కాసింత లేటు కావచ్చేమో కానీ.. ఎలాంటి భారీ రికార్డు అయినా బద్దలయిపోవాల్సిందే అనే మాట సినిమాల విషయంలో అక్షర సత్యం. మగధీర రికార్డులు చూసి.. మళ్లీ ఎప్పటికో అనుకున్నారంతా. అత్తారింటికి దారేది వరకూ ఇది పదిలంగానే నిలిచింది. శ్రీమంతుడు వచ్చి ఆ రికార్డులను తిరగరాసింది. శ్రీమంతుడుకి నెల ముందే బాహుబలి1 చాలా రికార్డులు సృష్టించింది. బాహుబలి2 వచ్చే వరకూ తొలి భాగం రికార్డుల్లో కొన్ని పదిలంగానే ఉన్నాయి. కొన్నిటిని మాత్రం మధ్యలో వచ్చిన మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 ఎగరేసుకు పోయింది. రీసెంట్ గా రంగస్థలం చిత్రం.. నాన్ బాహుబలి రికార్డులు మొత్తాన్ని తన ఖాతాలో వేసేసుకుంది.

అయితే.. ఇప్పుడు రికార్డుల విషయంలో ఫిలింఫేర్ అవార్డుల వంతు వచ్చింది. రీసెంట్ గా ప్రకటించిన అవార్డులలో బాహుబలి2 మొత్తంగా 8 కేటగిరీల్లో ఆధిపత్యం చూపించింది. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టగల స్థాయి ఏ సినిమాకు ఉంది.. ఈ రికార్డు బద్దలయేందుకు ఎన్నాళ్లు పడుతుంది అనే విషయంపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొందరు నెటిజన్ల అభిప్రాయం ప్రకారం.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా.. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ గా.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం రంగస్థలంకు ఉందనే వాదన వినిపిస్తోంది.

బెస్ట్ ఫిలిం.. డైరెక్టర్.. బెస్ట్ యాక్టర్.. సపోర్టింగ్ యాక్టర్-యాక్ట్రెస్.. సినిమాటోగ్రఫీ.. ఆర్ట్ డైరెక్షన్.. మ్యూజిక్ తో పాటు పలు విభాగాల్లో రంగస్థలం నిలుస్తుందంటూ.. వచ్చే ఏడాదికి ఇప్పటి నుంచే ఎక్స్ పెక్టేషన్స్ వేసేస్తున్నారు. బాహుబలి2 రికార్డులు వచ్చే ఏడాది వరకే ఉంటాయన్నది వారి వాదన. ఇది మరీ అతిశయోక్తి అనిపించే మాదిరిగా అయితే లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.. బాహుబలి2 ఎంతకాలం రికార్డులను నిలబెట్టుకుంటుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు