ఇప్పుడైనా గట్టిగా కొడతాడా అల్లు హీరో

ఇప్పుడైనా గట్టిగా కొడతాడా అల్లు హీరో

మెగా హీరోల్లో అందరూ మాంచి మాంచి హిట్లు కొట్టారు. ఒకరిని మించి ఒకరు అని కాకుండా.. ఎవరి రేంజ్ ను పెంచుకునేలా వారు తమ సత్తా చాటారు. రామ్ చరణ్ ఖాతాలో నాన్-బాహుబలి రికార్డులు ఉంటే.. నా పేరు సూర్య మినహా నిలకడగా హిట్లు కొట్టాడు అల్లు అర్జున్. ఫిదాతో జనాలను ఫ్యాన్స్ ను ఫిదా చేసేశాడు వరుణ్ తేజ్. సుప్రీమ్ తో సత్తా చాటిన సాయి ధరం తేజ్.. ఆ తర్వాత వెనుకబడ్డాడు.

కానీ అల్లు శిరీష్ కి మాత్రం ఇప్పటివరకూ శ్రీరస్తు శుభమస్తు ఒక్కటే చెప్పుకోదగిన హిట్. పెట్టుబడి పరంగా ఆ సినిమా హిట్ అయుండచ్చు కానీ.. జనాలను శిరీష్ తనవైపు తిప్పుకోగలిగిన రేంజ్ అయితే కాదు. శిరీష్ గత చిత్రం ఒక్క క్షణంకు బాగుందనే టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర లెక్కలు చాలలేదు. దాదాపు 6 నెలల పాటు గ్యాప్ తీసుకున్న అల్లు వారబ్బాయి.. ఇప్పుడు ఐదేళ్ల క్రితం మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఏబీసీడీ: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు.

ఇప్పటివరకూ స్ట్రెయిట్ చిత్రాలు చేశాడు.. ఓ మలయాళ చిత్రంలో కూడా నటించాడు శిరీష్. అయినా సరే ఆశించిన స్థాయి సక్సెస్ అయితే రాలేదు. మరి ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కు సూపర్బ్ ఇమేజ్ తెచ్చి పెట్టిన ఏబీసీడీ.. తెలుగు రీమేక్ కూడా అంతకు మించి సక్సెస్ సాధిస్తే.. శిరీష్ కు బ్రేక్ వచ్చినట్లే. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా ప్రారంభం కాగా.. ఈ సినిమాలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్.. సురేష్ బాబు షూటింగ్ ప్రారంభానికి హాజరయ్యి.. ఏబీసీడీ టీంను అభినందనలు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English