అమితాబ్.. షారుఖ్.. మధ్యలో తాప్సి

అమితాబ్.. షారుఖ్.. మధ్యలో తాప్సి

టాలీవుడ్లో ఉన్నంత కాలం మామూలు గ్లామర్ రోల్స్ చేసిన తాప్సి పన్ను బాలీవుడ్లో మాత్రం పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘పింక్’.. ‘నామ్ షబానా’ లాంటి సినిమాలతో ఆమె పేరు మార్మోగింది. అప్పుడప్పడూ కమర్షియల్ సినిమాలు చేస్తూనే పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తెోనూ ఆమె కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటోంది. ఇప్పుడామె చేతిలో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుంది. ఇప్పటికే ‘పింక్’ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి తెరను పంచుకున్న తాప్సీ ఈ లెజెండరీ యాక్టర్‌తో మరో సినిమా చేస్తోంది. ఆ సినిమా పేరు ‘బద్లా’.

ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంలందుకున్న స్పానిష్ థ్రిల్లర్ మూవీ ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’కు అఫీషియల్ రీమేక్. సుజయ్ గోష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ భాగస్వామిగా మారడం విశేషం. మరో నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా.. స్క్రిప్టు.. ఈ కాంబినేషన్ నచ్చి షారుఖ్ కూడా భాగస్వామి అయ్యాడు. అతను ఈ చిత్రంలో ఓ క్యామియో రోల్ కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఇలా ఒకేసారి అమితాబ్.. షారుఖ్ లాంటి లెజెండ్స్‌తో కలిసి పని చేస్తుండటం పట్ల తాప్సి మామూలు ఆనందంతో లేదు. తన కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిలా నిలుస్తుందని ఆమె అంటోంది. ఈ చిత్రంలో తాప్సి, అమితాబ్ రోల్స్ చాలా షాకింగ్‌గా ఉంటాయని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English