ఎన్టీఆర్ తో చరణ్‌ అండ్ మహేష్‌ వార్

ఎన్టీఆర్ తో చరణ్‌ అండ్ మహేష్‌ వార్

ఈసారి కూడా సంక్రాంతి పండుగ బాగా రసవత్తరంగా సాగనుంది. సంక్రాంతి సింహంగా నందమూరి బాలకృష్ణకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ సీజన్ లో వచ్చిన బాలయ్య సినిమాలు అనేకం బ్లాక్  బస్టర్లు కొట్టేశాయి. అయితే.. పోటీలోనూ పలుమార్లు నెగ్గడం ఆయన స్టైల్.

ఈసారి సంక్రాంతి పండుగకు కూడా హేమా హేమీలే పోటీ పడబోతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 9న విడుదల కానుండగా.. ఈ సీజన్ లో మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న మూవీ ఇప్పటికే షూటింగ్ చాలాభాగం పూర్తి చేసేసుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుండగా.. ఆ తర్వాత పాటలను పిక్చరైజ్  చేయనున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు బోలెడంత సమయం ఉండగా.. సంక్రాంతికి #RC12 వస్తుందని అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

మరోవైపు మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూడా సంక్రాంతి రేసులోనే నిలవనుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడే ప్రారంభించుకున్నా.. ఏడాదికి పైగా ప్రీ ప్రొడక్షన్ కు సమయం ఉండడంతో అన్నటినీ పక్కాగా ప్లాన్ చేసేసుకున్నారు. 4 నెలల సమయంలో షూటింగ్ పూర్తి చేసి.. పక్కాగా పోస్ట్ ప్రొడక్షన్ సమయం కేటాయిస్తారట. మొత్తం మీద బాలయ్య- మహేష్- రామ్ చరణ్.. ఈ సారి పొంగల్ కి పోటీ తీవ్రంగానే ఉండనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు