అల్లు అర్జున్ కు ఆయన కథ చెప్పాడట

అల్లు అర్జున్ కు ఆయన కథ చెప్పాడట

చాలా కాలం తర్వాత అల్లు అర్జున్ కి ఎదురు దెబ్బ తగిలింది. నిలకడగా హిట్స్ కొడుతూ దూసుకుపోతున్న బన్నీకి.. నా పేరు సూర్య రూపంలో షాక్ కొట్టింది. తన ప్రతీ సినిమా రిజల్ట్ ఆధారంగా తర్వాతి సినిమాపై డెసిషన్ తీసుకోవడం ఈ స్టార్ హీరోకు అలవాటు. అయితే.. అనూహ్యంగా ఎదురైన పరాజయం కారణంగా.. ఈ సారి కాసింత బ్రేక్ తీసుకుని మరీ తన మురసటి చిత్రాన్ని ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ.

యావరేజ్ సినిమాతో కూడా 70 కోట్ల వసూళ్లు రాబట్టే సత్తా ఉన్న హీరో కావడంతో.. అనేక మంది దర్శకులు ఆసక్తి చూపడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాలనే  పట్టుదలతో స్టైలిష్  స్టార్ ఉండగా.. తాజాగా ఫిదా మూవీతో సెన్సేషన్ సృష్టించిన శేఖర్ కమ్ముల.. అల్లు అర్జున్ ను కలిసి కథ వినిపించడం పూర్తయిపోయింది. కమ్ములతో మూవీపై ఆసక్తిగా ఉన్న బన్నీ.. ఈ సబ్జెక్టు గురించే కొన్ని వారాలుగా వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు కమ్ముల కథ చెప్పడం అయిపోయింది.

కొన్ని రోజుల్లోనే ఈ దర్శకుడితో సినిమాపై తుది నిర్ణయం తీసుకోనున్నాడట. ఒకవేళ శేఖర్ కమ్ముల సినిమా ఓకే కాకపోతే మాత్రం.. విక్రమ్ కె కుమార్ తో కానీ.. హరీష్ శంకర్ తో కానీ సినిమా చేసేందుకు సిద్ధమవుతాడట అల్లు అర్జున్. వారిద్దరి నుంచి ఇప్పటికే కథ-కథనం వినేయగా.. కమ్ములపై క్లారిటీ కోసమే టైమ్ పడుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English