బన్నీ సినిమా.. ప్రకటనే తరువాయి

బన్నీ సినిమా.. ప్రకటనే తరువాయి

నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తాడంటూ అల్లు అర్జున్‌ను తెగ పొగిడేసేవాళ్లు జనాలు. కానీ ఆ ట్రాక్ రికార్డుకు ‘దువ్వాడ జగన్నాథం’తోనే బ్రేక్ పడింది. అతడి కొత్త సినిమా ‘నా పేరు సూర్య’ యావరేజ్ టాక్ తెచ్చుకుని కూడా నిలబడలేకపోయింది. బన్నీ కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా అయింది. దీని తర్వాత సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్త పడాల్సి వస్తోంది బన్నీ. అందుకే ‘నా పేరు సూర్య’ విడుదలై నెల దాటినా ఇంకా తన తర్వాతి సినిమాను ప్రకటించలేదు. తనముందున్న ఆప్షన్స్ అన్నీ పరిశీలించి చివరికి విక్రమ్ కుమార్ దర్శకత్వంలోేనే తన తర్వాతి సినిమా చేయాలని డిసైడయ్యాడతను.

కొన్ని రోజుల కిందటే విక్రమ్ స్క్రిప్టు విని.. కొన్ని మార్పులు చేర్పులు చెప్పి వెకేషన్‌కు వెళ్లిన బన్నీ.. తాజాగా ఫైనల్ నరేషన్‌ విని సినిమాను దాదాపుగా ఓకే చేసేసినట్లు సమాచారం. కొన్ని రోజుల్లోనే ఈ సినిమాపై ప్రకటన వస్తుందంటున్నారు. ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది వెల్లడి కాలేదు. విక్రమ్ స్టయిల్లో కొత్తగా ఉంటూనే.. బన్నీ ఇమేజ్‌కు తగ్గట్లు ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దనున్నారట ఈ సినిమాను.

‘నా పేరు సూర్య’ పేలవమైన సినిమా ఏమీ కాకపోయినప్పటికీ అందులో బన్నీ నుంచి ఆశించే ఎంటర్టైన్మెంట్ లేకపోవడం మైనస్ అయింది. బన్నీని బాగా ఫాలో అయ్యే పిల్లలు, ఫ్యామిలీస్‌కి ఈ సినిమా రుచించలేదు. కాబట్టి ఈసారి ఆ విషయంలో లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్నాడు బన్నీ. విక్రమ్ కుమార్ కంటే ముందు ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయాలని అనుకున్న బన్నీ.. ‘నా పేరు సూర్య’ ఫలితం తర్వాత వెనక్కి తగ్గాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English