మసాలా తగ్గనివ్వట్లేదుగా!

మసాలా తగ్గనివ్వట్లేదుగా!

'ఈసారి ఇంకొంచెం మసాలా' అంటూ బిగ్‌బాస్‌కి ప్రోమోస్‌లోనే ప్రామిస్‌ చేసిన నిర్వాహకులు మసాలా తగ్గకుండా చూసుకుంటున్నారు. మొదటి వారం పూర్తయ్యేసరికి ఒక ఎలిమినేషన్‌ జరిగిపోగా, సామాన్యురాలి హోదాలో హౌస్‌లో ఎంటర్‌ అయిన సంజన అన్నే ఎలిమినేషన్‌కి గురయింది.

అయితే ఒకమ్మాయి వెళ్లిపోగానే మరో యువతిని హౌస్‌లోకి పంపించి మసాలా పాళ్లు తగ్గకుండా చూసుకున్నారు. కొత్తగా హౌస్‌లోకి ఎంటర్‌ అయిన యువతి పేరు నందిని రాయ్‌. మిస్‌ ఆంధ్రా కిరీటాన్ని గెలుచుకున్న ఈ పొడుగు కాళ్ల సుందరి పలు చిత్రాల్లోను నటించింది.

సుధీర్‌బాబు హీరోగా రూపొందిన 'మోసగాళ్లకి మోసగాడు' చిత్రంలో కథానాయికగా నటించిన నందిని గ్లామర్‌తో ఇప్పటికే యువత దృష్టిని ఆకర్షించిందని సోషల్‌ మీడియా రెస్పాన్సే చెబుతోంది. బిగ్‌ బాస్‌ లాంటి షోల్లో గ్లామర్‌ వున్న భామలకి లాంగ్‌ రన్‌ వుంటుందనేది తెలిసిందే. గత సీజన్‌లో అర్చన, దీక్షా పంత్‌ చాలా కాలం పాటు హౌస్‌లో వున్నారు. ఇప్పటికే తేజస్వి, భానుశ్రీ, దీప్తి సునయనలకి ఫాన్‌ ఫాలోయింగ్‌ బాగా వుంది.

ఇప్పుడు గ్లామర్‌ లవర్స్‌ని డివైడ్‌ చేసి కొత్త ఆర్మీ సిద్ధం చేసుకోవడానికి నందిని రాయ్‌ ఎంటర్‌ అయింది. ఈమె చూడ్డానికి బాగుంది కానీ ఆట ఎలా ఆడుతుందో, తన వల్ల హౌస్‌లో ఎలాంటి డైమెన్షన్‌ వస్తుందో చూడాలి. మంచి అందగాడు, పొడగరి వుంటే ప్రేమిస్తానంటూ చెబుతోన్న నందినికి ఆ లక్షణాలున్న సామ్రాట్‌తో ఎలా మసలుకుంటుందో మరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు