ఏ హీరో అయినా ఆమెకి ఫిదా

ఏ హీరో అయినా ఆమెకి ఫిదా

అనుపమ పరమేశ్వరన్‌ గురించి ఎవరైనా ఒకటే మాట చెబుతారు. విడిగా చూసినపుడు 'ఈమె మరీ సాధారణంగా వుంది. హైటు, పర్సనాలిటీ ఏమీ లేదు' అనిపిస్తుందట. అయితే ఒక్కసారి కెమెరా ముందుకి రాగానే ఆమె ఏంటనేది తెలుస్తుందట. అటు నటనతో అదరగొట్టడమే కాకుండా, ఫోటోజెనిక్‌ అయిన ఫేస్‌తో తెరపై మాయ చేస్తుందట.

అనుపమ నటనతో ప్రేక్షకులనే కాకుండా తనతో నటిస్తోన్న హీరోలని కూడా మంత్రముగ్ధుల్ని చేసేస్తోంది. ఒక్కసారి తనతో నటించిన హీరోలు ఆమెని రిపీట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారంటేనే అనుపమ స్పెషాలిటీ ఏమిటో తెలుస్తుంది. ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో ఆమెతో కలిసి నటించిన రామ్‌ తదుపరి చిత్రంలోను హీరోయిన్‌గా అనుపమే వుండి తీరాలని చెప్పడంతో ఆమెనే ఖాయం చేసారు.

తాజాగా 'తేజ్‌'లో ఆమెతో జత కట్టిన సాయి ధరమ్‌ తేజ్‌ కూడా తన నెక్స్‌ట్‌ సినిమాకి అనుపమ పేరు సిఫార్సు చేస్తున్నాడట. ఇద్దరు హీరోయిన్లుండే ఆ చిత్రంలో ఒక కథానాయికగా అనుపమ అయితే బాగుంటుందని తేజ్‌ ఇచ్చిన సజెషన్‌ని నిర్మాత, దర్శకులు పాటిస్తారో లేదో కానీ మెగా మేనల్లుడయితే ఆమెకి ఫిదా అయిపోయాడనే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మధ్య శ్రేణి సినిమాలకి అనుపమ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు